ఎర్రబెల్లి వర్సెస్ కడియం | Sakshi
Sakshi News home page

ఎర్రబెల్లి వర్సెస్ కడియం

Published Mon, May 25 2015 2:43 AM

ఎర్రబెల్లి వర్సెస్ కడియం

 కొనసాగుతున్న మాటలయుద్ధం
 టీఆర్‌ఎస్, టీడీపీ శ్రేణుల ఘర్షణ
 
 పాలకుర్తి/దేవరుప్పుల: డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి.. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య మాటలయుద్ధం కొనసాగుతోం ది. ఆదివారం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మె రలో జరిగిన కార్యక్రమంలో ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు. గ్రామంలో రూ. 4 కోట్ల తో నిర్మించనున్న రోడ్ల పనులకు డిప్యూటీ సీఎం కడియం, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎర్రబెల్లి మాట్లాడు తూ.. ‘అభివృద్ధి పనులకు నిధుల మంజూరు లో వివక్ష చూపొద్దని చేతులెత్తి మొక్కుతు న్నా.. నాపై కక్షను ప్రజలపై తీర్చుకోవద్దు.’ అని అన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణాల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు రూ. 30 కోట్ల వరకు మంజూరు చేసిన ప్రభుత్వం... పాలకుర్తికి రూ. 4.50 కోట్లు మాత్రమే ఇచ్చి వివక్ష చూపిందన్నారు.
 
  సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చిన సమయంలో ఆయనను కలిసి పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూ రులో స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. మధ్య లో నిధుల మంజూరును అడ్డుకున్న దొంగలెవరో తేల్చాలన్నారు. ఆ తర్వాత కడియం శ్రీహరి మాట్లాడుతూ  నిధుల మంజూరులో వివక్ష లేదన్నారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి జోక్యం చేసుకుని నియోజకవర్గానికి సీఆర్‌ఆర్ గ్రాంటు లో  రూ. 4.50 కోట్లు మాత్ర మే వచ్చాయని, మిగిలిన నిధుల మంజూరుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇంతలో టీఆర్‌ఎస్ నాయకుడు ముత్తినేని సోమేశ్వర్‌రావు దయాకర్‌రావును అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే టీఆర్‌ఎస్, టీడీపీ కార్యకర్తలు వేదిక వైపు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ కూర సురేందర్, సీఐ తిరుపతి, ఎస్సై ఉస్మాన్ షరీఫ్ పోలీసు బలగాలతో వారిని అడ్డుకున్నారు. సుమారు 20 నిమిషాలు సమ యం ఇరువర్గాలు నినాదాలు చేసుకున్నారు.  కడియం విజ్ఞప్తి మేరకు ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. అరుుతే కడియం వెళ్తుండగా నియోజకవర్గానికి నిధులు అడ్డుకుంది ఆయనేనని దయాకర్‌రావు అన్నారు.

Advertisement
Advertisement