Sakshi News home page

గాంధీ ఆస్పత్రిలో పేలిన తుపాకి

Published Wed, Mar 28 2018 3:43 AM

Gunshot wounded in Gandhi Hospital - Sakshi

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం యాక్సిడెంటల్‌ ఫైర్‌ జరిగింది. ఆస్పత్రి ప్రధాన భవనంలోని ఖైదీల వార్డులో సెంట్రీ విధులు నిర్వర్తిస్తున్న సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (సీఏఆర్‌) కాని స్టేబుల్‌ సాయినాథ్‌ చేతిలో ఉన్న .303 రైఫిల్‌ ప్రమాదవశాత్తు పేలింది. సాయినాథ్‌ చెయ్యి పొరపాటున ట్రిగ్గర్‌పై పడటంతో పెద్ద శబ్దంతో తుపాకీ పేలింది. ఎడమ వైపు ఛాతిలోకి దూసుకుపోయిన తూటా వెనుక నుంచి బయటకు వచ్చి.. కిటికీ గ్రిల్స్‌కు తాకి ముక్కలైంది. అతడిని వెంటనే అత్యవసర విభాగానికి తరలించి వైద్య సేవలు అందించారు.

సాయినాథ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని.. 3 రోజులు పర్యవేక్షణలో ఉంచితే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ రుద్రభాస్కర్‌ సాయినాథ్‌తో పాటు అతడి సహచరుడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.  

Advertisement

What’s your opinion

Advertisement