ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

Published Fri, Jan 5 2018 3:30 AM

harish rao commented over congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ఉద్యోగుల సమస్య లన్నింటినీ  పరిష్కరిస్తుందని మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో టీఎన్జీవోస్‌ డైరీ, క్యాలెండర్‌–2018 ఆవిష్కరణ జరిగింది. ఉద్యో గుల సమస్యల పట్ల ఎవ్వరు ఆందోళన చెందవద్దని మంత్రి అన్నారు. ఏపీలో ఉన్న 400 మంది నాల్గవ తరగతి ఉద్యోగులను తెలంగాణకు తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

24 గంటల విద్యుత్‌తో తెలంగాణ చరిత్ర సృష్టిస్తోందన్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తే సీఎంకు కార్యకర్తగా పనిచేస్తానని ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి అన్నా రని, ఆ విషయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తెలంగాణకు, ప్రభుత్వానికి మంచి పేరు రావటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు.

సర్వీస్‌ రూల్స్‌ సరళీకృతం చేయాలి..
ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 20% ఇవ్వాలని, ఆ బాధ్యత హరీశ్‌రావు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్‌ కె.స్వామి గౌడ్‌ కోరారు. సర్వీస్‌ రూల్స్‌ సరళీకృతం చేయాలని, ఆరు నెలల ముందే ఉద్యోగుల పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బేవరేజస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జి.దేవిప్రసాదరావు, సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, టీఎన్జీవోస్‌ సెంట్రల్‌ యూనియన్‌ అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రాజేందర్, అసోసియేట్‌ అధ్యక్షుడు ఎం.ఉపేందర్‌ రెడ్డి, ఉమెన్‌ చైర్‌పర్సన్‌ బి.రేచల్, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement