Sakshi News home page

Published Thu, Jul 12 2018 1:57 PM

Heavy Rain In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారీ వర్షంతో నగరం తడిసి ముద్దయింది. గత రాత్రి 12 గంటల నుంచి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం పడుతూనే ఉంది. దీంతో ఈ ఉదయం స్కూళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లాల్సిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రహదారులపై నీరు చేరింది, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

దిల్‌సుఖ్‌ నగర్‌ ప్రాంతంలోని రోడ్లన్ని జలమయమయ్యాయి. బంజారాహిల్స్‌, కోఠి, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్‌కి అంతరాయం కలిగింది. ఉప్పల్‌లో 2.3సెం.మీ, పటాన్‌ చెరులో 3.1సెం.మీ, బేగంపేటలో 2.3సెం.మీ, మల్కాజ్‌గిరిలో 2.7సెం.మీ మేర వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్‌, చింతల్‌ బస్తీ ప్రాంతాలలోని రోడ్లన్ని నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఇండ్లలోని వర్షం నీరు వచ్చి చేరింది. భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement
Advertisement