పేదలకు పక్కాఇళ్లు | Sakshi
Sakshi News home page

పేదలకు పక్కాఇళ్లు

Published Mon, Aug 31 2015 1:28 AM

పేదలకు పక్కాఇళ్లు - Sakshi

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పట్టణపేదలకు శుభవార్త..! ఇక వారి సొంతింటి కల నెరవేరనుంది. ఇన్నాళ్లకు కేంద్రప్రభుత్వం జిల్లాకు ఓ మంచి కానుకను ప్రకటిస్తూ మేలుకలిగే నిర్ణయిం తీసుకుంది. మునిపిపాలిటీల్లో పేదలందరికీ పక్కాఇళ్లు నిర్మించేందుకు ప్రధానమంత్రి అవాజ్ యోజన పథకం కింద జిల్లాలోని ఐదు మునిసిపాలిటీలను కేంద్రప్రభుత్వం ఎంపికచేసింది. వీటిలో జిల్లాకేంద్రమైన మహబూబ్‌నగర్‌తోపాటు నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, కొల్లాపూర్, అచ్చంపేట మునిసిపాలిటీలు ఉన్నాయి. ఈ మునిసిపాలిటీల్లో పేదలందరికీ పక్కాఇళ్లు నిర్మించేందుకు ఒక్కోఇంటికి రూ.2.30లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనుంది.

దీంతో పట్టణాల్లో నివాసం ఉండే పేదల జీవనస్థితిగతులు పూర్తిగా మారనున్నాయి. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని డబుల్ బెడ్‌రూమ్ పథకానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు రాష్ట్రం అదనంగా నిధులు మంజూరు చేసినట్లయితే పేదలందరికీ డబుల్‌బెడ్ రూమ్ దాదాపు ఖాయమే.. ఒక్కజిల్లా కేంద్రంలోనే లక్షమందికి పైగా పేదలు ఉండగా, మిగతా నాలుగు మునిసిపాలిటీల్లో వేలసంఖ్యలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి సొంతింటికల నెరవేరనుంది.

Advertisement
Advertisement