ధర్నాచౌక్‌ పరిరక్షణకు ఉద్యమం : చాడ | Sakshi
Sakshi News home page

ధర్నాచౌక్‌ పరిరక్షణకు ఉద్యమం : చాడ

Published Fri, Apr 7 2017 3:02 AM

ధర్నాచౌక్‌ పరిరక్షణకు ఉద్యమం : చాడ - Sakshi

ఈ నెల 15 నుంచి మే 9 వరకు నిరాహార దీక్షలు: చాడ
సాక్షి, హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ను పరిరక్షించుకునేందుకు ప్రజా ఉద్య మాలు ప్రారంభిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ధర్నా చౌక్‌ పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ప్రజా, విద్యార్థి, కార్మిక, కర్షక, మహిళా సంఘాలతో దశలవారీగా ఉద్యమాలు నిర్వహించి ధర్నాచౌక్‌ను ఇందిరాపార్క్‌ వద్దే కొనసాగిం చేలా ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. గురువారం మగ్దూంభవన్‌లో ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. చాడ వెంకట్‌రెడ్డి మాట్లా డుతూ ధర్నా చౌక్‌ ఎత్తివేయొద్దని గవర్నర్, హోంమంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు.

శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ఈ నెల 15 నుంచి మే 9 వరకు మగ్దూంభవన్‌ ఎదుట రోజుకో సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహిస్తామ న్నారు. మే 10న ఇందిరాపార్క్‌ వద్ద భారీ సభ ఏర్పాటు చేస్తామన్నారు. సమా వేశంలో పరిరక్షణ కమిటీ కో కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు, న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, ప్రజా తెలంగాణ వేదిక గాదె ఇన్నయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ రవిచంద్ర, ఎంసీపీఐ సాంబయ్య, సీపీఐ నేత ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement