Sakshi News home page

లక్ష్యం

Published Fri, Aug 21 2015 3:31 AM

Journey to the achievement of the coaching job

కొలువుల సాధనకు కోచింగ్ బాట..
 
నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ శాఖల్లో 770 సివిల్ ఇంజనీర్ల పోస్టుల భర్తీ కోసం తొలి నోటి ఫికేషన్ జారీ అరుుంది. వివిధ శాఖల్లో 15,522 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కారు జీఓ జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ పబ్లిక్‌సర్వీస్ కమిషన్  3,783 ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. వచ్చే కొద్ది రోజుల్లో వరుసగా నోటిఫికేషన్లు రానున్నారుు. ఈ నేపథ్యంలో గ్రూప్స్, ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులతో కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నారుు. వివిధ జిల్లాల నుంచి కూడా ఉద్యోగార్థులు ఇక్కడికి వస్తున్నారు. వీరి నుంచి కోచింగ్ సెంటర్లు వేలల్లోనే ఫీజులు వసూలు చేస్తున్నారుు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయూ కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇస్తున్నారు. గ్రూప్2లో ఒక పేపర్ పెరిగింది. సిలబస్ కూడా మారింది. ఈ నేపథ్యంలో కోచింగ్ అనివార్యమని నిరుద్యోగులు భావిస్తున్నారు. కానీ, సిలబస్‌పై సర్కారు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
 - విద్యారణ్యపురి/నయూంనగర్
 
 గ్రూప్ - 2లో ఇంటర్వ్యూ తొలగించాలి
 రెండు నెలలుగా గ్రూప్-2 కోచింగ్ తీసుకుంటున్నా. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటన జారీలో జాప్యం మూలంగా చాలా మంది నిరాశతో ఉన్నారు. ఆగస్టు 10 న నోటిఫికేన్ వెలువడుతుందని భావిస్తున్నాం. గ్రూప్-2 లో ఇంటర్వ్యూ విధానం తొలగించాలి.
 - మద్దెర్ల శ్రీనివాస్, హుజూరాబాద్,
 కరీంనగర్
 
 
ప్రైవేట్ జాబ్ వదులుకున్నా..

 నేను ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌ను. గ్రూప్-2కు సన్నద్ధమయ్యేందుకు ఉద్యోగాన్ని మానేశా. సీరియస్‌గా ప్రిపేరవుతున్నా. కానీ, మాలాంటోళ్ల ఓపికను సర్కారు పరీక్షిస్తోంది. నోటిఫికేషన్ త్వరగా ఇవ్వాలి. అలాగే మేం చదువుకోవడానికి తగినంత సమయం కూడా ఇవ్వాలి.    - ఆడేపు హిందు, వరంగల్
 
 
నిరుద్యోగులతో చెలగాటం

మూడునెలలుగా గ్రూప్-2 కోచింగ్ తీసుకుంటున్నా. గ్రూప్-2లో నాలుగో పేపర్‌పై సర్కారు స్పష్టత ఇవ్వాలి. మారిన సిలబస్‌ను వెంటనే విడుదల చేయూలి. నోటిఫికేషన్ల విషయంలో సర్కారు వైఖరి సరిగా లేదు. నిరుద్యోగులతో ఇలా చెలగాటమాడడం తగదు.  
 - గోల్కోండ రాజేష్, న యీంనగర్
 
 
మళ్లీ కోచింగ్‌కు వెళ్తున్నా..
నేను ఎంబీఏ పూర్తి చేశాను. గ్రూప్-2 కోసం రెండేళ్లుగా ప్రిపేరవుతున్నా. కోచింగ్ కూడా తీసుకున్నా. సిలబస్‌లో మార్పులు చేశారని తెలిసి మళ్లీ కోచింగ్‌కు వస్తున్నా. కానీ, ఇప్పటికీ సిలబస్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వక ఆందోళనకు గురవుతున్నాం. త్వరగా తేల్చాలి.
 -చిగురు మాలతి, అడ్వకేట్స్ కాలనీ, హన్మకొండ
 
ఇంకెన్ని రోజులో..
గ్రూప్-2 కోసం శిక్షణ పొందుతున్నా. ప్రభుత్వం నిరుద్యోగులతో ఆడుకుంటోంది. గతంలో గ్రూప్-2 ప్రిపేరైన వాళ్లు మళ్లీ శిక్షణ పొందాల్సిన పరిస్థితి కల్పించారు. సిలబస్ మార్చడంతో తప్పడం లేదు. ఎన్నెన్నో ఆశలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా గత పాలకుల్లాగే వ్యవహరిస్తోంది.   - మారెపల్లి అనూష, జమ్మికుంట, కరీంనగర్
 
 హాస్టల్‌లో ఉంటూ..
 నేను ఎంఫార్మసీ పూర్తిచేశాను. ఇంకాప్రాజెక్టు వర్క్ పూర్తి చేయాల్సింది. అరుునా హన్మకొండకు వచ్చి గ్రూప్-2 కోచింగ్ తీసుకుంటున్నా. ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ నెలరోజులుగా శిక్షణ  పొందుతున్నా. కోచింగ్ సెంటర్‌లో చెప్పే మెలకువలు ఉపయోగపడుతారుు.  
 -  జాడి ప్రవీణ, ఆసిఫాబాద్, ఆదిలాబాద్
 
 డీఎస్సీ కోసం నిరీక్షించి..
 నేను ఎంఏ బీఈడీ పూర్తిచేశాను. ఎంత ఎదురు చూసినా డీఎస్సీ నోటిఫికేషన్ రావడం లేదు. దీంతో గ్రూప్ -2 కోసం రెండు నెలలుగా కోచింగ్ తీసుకుంటున్నా. శిక్షణతోనే అన్ని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు సిలబస్ మారటంతోపాటు ఒకపేపర్‌కూడా పెరిగింది.
 - ఎన్ రజిత, హన్మకొండ
 
 
టాపిక్స్ వెల్లడించాలి

నేను నెల రోజులుగా గ్రూప్2 కోచింగ్ పొందుతున్నా. నోటిఫికేషన్ అక్టోబర్‌లో వస్తుందంటున్నారు. ఆ తర్వాత  పరీక్షకు కూడా కొంత సమయం ఉంటుంది. కాబట్టి బాగా సన్నద్ధమై ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నాను. సిలబస్ మారింది. అయితే అందులోని టాపిక్స్‌కూడా వెంటనే వెల్లడిస్తే బాగుంటుంది.
 - ఆర్ రాంబాబు, హన్మకొండ
 
 ప్రభుత్వ ఉద్యోగంతో సెక్యూరిటీ..
నేను సాఫ్ట్‌వేర్‌సంస్థలో ఉద్యోగం చేసేవాణ్ని. ప్రభుత్వ ఉద్యోగం అయితే సెక్యూరిటీగాఉంటుందని భావించి గ్రూప్-2కు సన్నద్ధం కావాలని భావించా.  ఉద్యోగం వదిలేసి ఈ రోజే అకాడమిలో చేరాను. శిక్షణ తీసుకుంటే పరీక్ష బాగా రాయొచ్చని నా ఉద్దేశం.  
  - సాజిత్‌పాషా, హన్మకొండ
 
ఆ పట్టుదల ఉంది
 గ్రూప్-2 కోసం శిక్షణ పొందుతున్నా. అధ్యాపకులు కూడా ఇక్కడ బాగానే బోధన చేస్తున్నారు. శిక్షణ తీసుకోవటం వల్ల అనేక లాభాలున్నారుు. అర్థం కాని అనేక విషయూలను అవగాహన చేసుకునే వీలుంటుంది. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. బాగా చదివి ఉద్యోగం సాధించాలనే పట్టుదల ఉంది.  - ఎన్. హిమజ, హన్మకొండ
 
ఇంగ్లిష్ మీడియంలో గ్రూప్-2 శిక్షణ

బీటెక్ పూర్తిచేశాను. ఇంగ్లిష్ మీడియం లో గ్రూప్ -2 శిక్షణ కోసం ఇటీవలనే అకాడమీలో చేరాను. నాలుగు పేపర్లకు నాలుగు నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. సిలబస్ పూర్తిస్థాయిలో ప్రకటిస్తే బాగుంటుంది.  
 - జె. రాకేష్, కాజీపేట
 
నోటిఫికేషన్‌కు ముందే సిలబస్ ఇవ్వాలి

 మా సంస్థలో గ్రూప్-2,ఎస్సై, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం. ఫ్యాకల్టీ కొరత చాలా ఉంది. గతంలో కోచింగ్ తీసుకున్న వారే నోటిఫికేషన్లు రాక.. ఇప్పుడు ఫ్యాకల్టీగా మారారు. బాగా చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి కూడా కొందరిని రప్పించి శిక్షణ ఇప్పిస్తున్నాం. నోటిఫికేషన్‌కు ముందే ప్రభుత్వం సిలబస్ ప్రకటించాలి. ఈసారి వరంగల్‌నుంచి సుమారు 60వేలమంది గ్రూప్-2 కు హాజరయ్యేలా ఉన్నారు. హన్మకొండలో మొత్తం సుమారు 5వేలమంది వరకు శిక్షణ పొందుతున్నారు. మా సెంటర్‌లో 500లమంది అభ్యర్థులున్నారు.  
 - మల్లోజు సత్యనారాయణాచారి, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు
 
మారిన సిలబస్‌తో శిక్షణ తప్పనిసరి

 గ్రూప్ -2 ఉద్యోగాలకు సిలబస్‌లో మార్పులు చేశారు. అందుకు అనుగుణంగా మళ్లీ శిక్షణ పొందడం తప్పనిసరి. గతంలో శిక్షణ పొందిన వారికీ ఇది వర్తిస్తుంది. నోటిఫికేషన్‌లోనూ జాప్యం జరిగింది. అక్టోబర్‌లో నోటిఫికేషన్ రానుండటంతో ఇక శిక్షణకు అభ్యర్థులు సంఖ్య ఇంకాపెరిగిపోనుంది. సిలబస్‌లో మార్పులు చేశారు కాబట్టి అందుకు సంబంధించిన ఏమేం టాపిక్స్ ఉంటాయో వాటిని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. అప్పుడే కోచింగ్ తీసుకునే అభ్యర్థులకు మేలు జరుగుతుంది. నోటిఫికేషన్ కంటే ముందే సిలబస్ ప్రకటించాలి.
 - ఆర్. రాజిరెడ్డి, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు

Advertisement

What’s your opinion

Advertisement