మల్లన్న పెళ్లికి చంద్రన్న | Sakshi
Sakshi News home page

మల్లన్న పెళ్లికి చంద్రన్న

Published Sun, Dec 21 2014 1:14 AM

మల్లన్న పెళ్లికి చంద్రన్న - Sakshi

స్వామి వారికి పట్టు వ్రస్త్రాలు సమర్పించనున్న సీఎం కేసీఆర్
రెండున్నర గంటల పర్యటన

 
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణానికి ఆదివారం సీఎం కే.చంద్రశేఖరరావు వస్తున్నారు.. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.. ఈ సందర్భంగా ఏర్పాట్లను సీఎం ఇంటెలిజెన్‌‌స సెక్యూరిటీ ఐజీ ఎం.ఎం. మహేశ్ భగవత్, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, కలెక్టర్ కిషన్ పర్యవేక్షించారు..
 - చేర్యాల/హన్మకొండ అర్బన్   
 
శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు..
 
అయ్యూ.. మేము శ్రీ మల్లికార్జున స్వామి భక్తులం. ఏటా జాతర బ్రహ్మోత్సవాల్లో కొమురెల్లి మల్లన్నను దర్శించుకునేటోళ్లం. మది నిండా మల్లన్నను నింపుకొని కొమురెల్లికి వస్తే.. ఇక్కడ సమస్యలే స్వాగతం పలుకుతున్నారుు. ప్రతీ ఏడాది వచ్చే మాకు ఎప్పుడూ గీ అవస్థలే ఎదురవుతున్నారుు. నేడు(ఆదివారం) జరిగే మల్లన్న పెండ్లికి మీరు కూడా వస్తున్నరని తెలిసింది. మీతో చెప్పుకుంటే మా కష్టాలు తీరుతాయనే నమ్మకంతోనే గీ లేఖ రాస్తున్నం. మాకు తోచిన పరిష్కారాలు కూడా పేర్కొన్నం. జెర పరిశీలించుండ్రి. వచ్చే ఏటికన్నా.. అన్ని వసతులు కల్పించుండ్రి.
 
సమస్య : దర్శనానికి వచ్చినోళ్లం గుడారాలు వేసుకుని ఉంటున్నం.
పరిష్కార మార్గాలు : అర్ధంతరంగా నిలిచిపోరుున చౌల్ట్రీ(వసతి గృహ సముదాయం) నిర్మాణాన్ని పూర్తిచేయూలి. స్వామి దర్శనం కోసం క్యూ లైన్ ఇక్కట్లు సుమారు 5 గంటలు నిల్చుంటేనే దర్శనం లభిస్తుంది. క్యూ లైన్లలో భక్తులకు కూర్చునే వె సులుబాటు, తాగునీరు, ఫ్యాన్లు, తదితర వసతులు కల్పించాలి.  రాజగోపురం పక్కన ఖాళీస్థలంలో మూత్రశాలలు నిర్మించాలి. వృద్ధులు, వికలాంగులు, భారీకాయులు దర్శనానికి అవస్థలు పడుతున్నారు.  ఆలయ ప్రాంగణంలో లిఫ్ట్ ఏర్పాటు చేయూలి.  భక్తుల వస్తు సామగ్రికి రక్షణ ఉండడం లేదు   రాజగోపురం వద్దచెప్పుల స్టాండ్, లగేజీ స్టాండ్‌లు ఏర్పాటు చేయూలి.    డబ్బుల అత్యవసరమైతే సిద్ధిపేట, దుద్దెడకు వెళ్లాల్సి వస్తోంది.  కొమురవెల్లిలో ఏటీఎంలు ఏర్పాటు చేయూలి. ఆలయ ప్రాంగణంపై అధికారులు దృష్టి పెట్టడం లేదు.
 ఆలయ ఆవరణ, పరిసర వీధుల్లో సీసీ రోడ్లు వేసి డ్రెరుునేజీలు కట్టించాలి.  
 
 జాతరలో లక్షకుపైగా భక్తులకు తాగునీటి వసతి సరిగా లేదు.  స్థానిక నీటి ట్యాంకులకు తోడు కోడెల స్తంభం, బస్టాండ్, దాసారం గుట్ట, సినిమాటాకీసు, రాంసాగర్ రోడ్డు, పెద్దమ్మ ఆలయం వద్ద మరిన్ని నీటి ట్యాంకులు ఏర్పాటు చేయూలి.   మల్లన్న చెరువులోకి మురికి నీరు చేరి మా మనోభావాలు దెబ్బతింటున్నారుు. ఇందులో స్నానం చేయలేపోతున్నారు. ఈ మురికినీటిని మత్తడి నుంచి బయటకు పంపించేలా ప్లానింగ్ చేయించి నిధులు విడుదల చే రుుంచాలి.   మల్లన్నకు మొక్కులు చెల్లించాక మల్లన్న గుట్టపైన రేణుక ఎల్లమ్మకు బోనాలు అప్పగిస్తాం. కానీ అక్కడికెళ్లడానికి తిప్పలు పడుతున్నం.

మల్లన్న గుట్టపైకి మెట్లకు మరమ్మతులు చేరుుంచాలి. గుట్టపై రేకుల షెడ్డు, కుర్చీలు వేయూలి. తాగునీటి వసతి కల్పించాలి. ఆలయూనికి భక్తుల రాక పెరిగినా అభివృద్ధి జరగడం లేదు. మల్లన్న జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఏటా నిధులు కేటారుుస్తే ఐదేళ్లలో దశ మారనుంది.
 
సీఎంగారూ.. ఇంకో ముచ్చట

 
మల్లన్న గుట్ట ప్రకృతి సోయగాల నడుమ వెలసింది. ఇక్కడి అందాలను భక్తులు పూర్తిస్థారుులో ఆస్వాదించేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదానికి మల్లన్న ఆలయూన్ని నెలవుగా మార్చినట్లవుతుంది. ఆలయ పరిసర ప్రాంతంలో పార్కులు ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకునేందుకు, ఇతర సామగ్రి సమకూర్చితే ఉపయోగకరమవుతుంది. మల్లన్న చెరువులో బోటింగ్‌ను ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. గుట్టపైకి వెళ్లడానికి రూప్‌వేను ఏర్పాటు చేయాలి. గతంలోనూ పాలకులు మల్లన్న జాతరకు వచ్చి అనేక హామీలు ఇచ్చి విస్మరించారు. పొన్నాల లక్ష్మయ్య దేవాదాయ ధర్మదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడూ నిధులు పెద్దగా దక్కలేదు. తొలిసారి స్వరాష్ట్రంలో జరుగుతున్న మల్లన్న కల్యాణ వేదిక వద్ద.. ఆలయ దశ మార్చే ప్రకటనను మేమంతా ఆశిస్తున్నాం. ఆ తదిపరి కార్యాచరణనూ కోరుకుంటున్నాం.  
 ఇట్లు
కొమురెల్లి మల్లన్న భక్తులు
 
 సీఎం షెడ్యూల్
 
ఉదయం(గంటలు)
10.45 :  బేగంపేట నుంచి బయల్దేరుతారు.
11.00 : చేర్యాలకు చేరుకుంటారు.
11.30 : కొమురవెల్లికి చేరుకుంటారు.
11.50 : కల్యాణంలో పాల్గొంటారు.
 

మధ్యాహ్నం..
 
12.30 : కురుమ  సంఘ భవనం ప్రారంభోత్సవం.
 1.00 :  భోజనం
 1.30 :  తిరుగు         
             పయనం

Advertisement
Advertisement