కాంట్రాక్టర్లను కాదు..రైతులను బాగు చేయాలి | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్లను కాదు..రైతులను బాగు చేయాలి

Published Mon, Feb 27 2017 2:28 AM

కాంట్రాక్టర్లను కాదు..రైతులను బాగు చేయాలి - Sakshi

టీజేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరాం

కొత్తగూడెం టౌన్‌: ప్రభుత్వం కాంట్రాక్టర్ల ను కాకుండా.. రైతులను బాగు చేసే ఆలోచన చేయాలని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం సూచించారు. సమస్యలపై పోరాటం చేసేవారిని అడ్డుకోవడం గొప్పతనం కాదని.. ఆ సమస్యను పరిష్కరిస్తేనే గౌరవం గా ఉంటుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన టీపీ టీఎఫ్‌ జిల్లా మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన కోదండరాం విలేకరులతో మాట్లా డారు. నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

లక్ష ఉద్యోగాల ప్రకటన ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని.. చివరికి అభ్యర్థుల వయసు సైతం మించిపోయే పరిస్థితులు ఉన్నా యన్నారు. తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యతోపాటు వాటి భర్తీకి పోటీ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మల్లన్న రిజర్వాయర్‌ నుంచి 50 టీఎంసీల నీటిని ఎలా మళ్లిస్తున్నారో, శ్రీశైలం కాలువ పనులు చూస్తే కాంట్రాక్టర్ల దోపిడీకి ప్రభుత్వం ఎంత మద్దతుగా ఉందో అర్థమవుతుందన్నారు. భూములను కోల్పో తున్న రైతుల పక్షాన ప్రశ్నిస్తే.. అన్ని వర్గాలను రెచ్చగొడుతున్నా రని, ప్రభుత్వం లోని పెద్దలే అవాకులు చెవాకులు పేలు తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల సహాయంతో పోరా టాలు చేశానని.. సొంత నిర్ణయాలు తీసు కునే తెలివి తేటలు తనకున్నాయని తెలిపారు. సొంతంగా ఆలోచించే శక్తిలే ని కొందరు దద్దమ్మలు చేసే ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానన్నారు.

Advertisement
Advertisement