నిర్వహణ సరిగాలేదు | Sakshi
Sakshi News home page

నిర్వహణ సరిగాలేదు

Published Sat, Mar 18 2017 3:15 AM

నిర్వహణ సరిగాలేదు - Sakshi

జీహెచ్‌ఎంసీలో బస్టాండ్లపై మంత్రి కేటీఆర్‌
జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్టాండుల నిర్వహణ సరిగా జరగడం లేదనేది వాస్తవమేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బస్‌ షెల్టర్లు నిర్మించడం తేలికే కాని నిర్వహణే కష్టమని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో మొత్తం 1,183 బస్‌ షెల్టర్లు ఉండగా.. అందులో 430 బస్‌ షెల్టర్ల ఆధునీకరణకు టెండర్లు పిలిచామని, వారంలో వాటిని పూర్తి చేస్తామని వెల్లడించారు.

‘అధికారులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీ, బెంగళూరుల్లో అధ్యయనం చేసి వచ్చారు. నగరంలోని ట్రాన్స్‌పోర్టు వ్యవస్థని జీహెచ్‌ఎంసీలో భాగం చేయాలనే ప్రయత్నిస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాల్లో గత మూడేళ్లుగా హైదరాబాద్‌ దేశంలొనే మొదటి స్థానంలో ఉంది. నగరంలోని ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం చేయడం ఒక్కటే పరిష్కారం’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement