వ్యవసాయదారుల జాబితాలో కౌలుదారులు | Sakshi
Sakshi News home page

వ్యవసాయదారుల జాబితాలో కౌలుదారులు

Published Sat, Dec 3 2016 2:48 AM

వ్యవసాయదారుల జాబితాలో కౌలుదారులు

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈటల

 సాక్షి, న్యూఢిల్లీ: కౌలు రైతులను జీఎస్టీ బిల్లులో వ్యవసా యదారుల జాబితాలో చేర్చాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్ ఐదో సమావేశంలో రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు తెలిపారు.

జీఎస్టీ ముసాయిదా బిల్లులో సొంత భూమిలో వ్యవసాయం చేసే వారిని మాత్రమే వ్యవసాయదారులుగా పేర్కొ న్నారని, దీని వల్ల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే వారు నష్టపో తారని వివరించినట్టు చెప్పారు. డైరీ, పౌల్ట్రీ, హార్టి, సెరీకల్చర్‌లను వ్యవసా యరంగ జాబితాలో చేర్చాలని అన్ని రాష్ట్రాలు ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో చర్చించారు. తెలంగాణకు రావాల్సిన రూ.450 కోట్లను విడుదల చేయాలని మంత్రిని కోరినట్టు ఈటల తెలిపారు.

Advertisement
Advertisement