వయాడక్ట్‌ట్రాక్‌పై మెట్రో పరుగులు | Sakshi
Sakshi News home page

వయాడక్ట్‌ట్రాక్‌పై మెట్రో పరుగులు

Published Thu, Oct 30 2014 12:41 AM

వయాడక్ట్‌ట్రాక్‌పై మెట్రో పరుగులు - Sakshi

  • అర్ధరాత్రి ట్రయిల్ రన్
  • సాక్షి,సిటీబ్యూరో: విద్యుత్ దీపకాంతుల మధ్య నాగోల్-మెట్టుగూడా రూట్లో (వయాడక్ట్‌ట్రాక్‌పై 8 కి.మీ) రెండో మెట్రోరైలుకు బుధవారం రాత్రి 9.30 గంటల నుంచి గురువారం తెల్లవారు ఝాము  2 గంటల వరకు టెస్ట్న్రవిజయవంతంగా నిర్వహించారు. ఉప్పల్ మెట్రో డిపోలో ఏడు మెట్రో రైళ్లుండగా నెలరోజులుగా ఒకే మెట్రో రైలుకు 14రకాల పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. బుధవారం రాత్రి మాత్రం రెండో రైలును ట్రాక్‌పై విజయవంతంగా నడిపినట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. తొలిరైలుకు రైల్వేసేఫ్టీ ధ్రువీకరణ కూడా లభించిందన్నారు.

    మొత్తం ఏడు రైళ్లకు వేర్వేరుగా ప్రయోగ పరీక్షలు నిర్వహించిన అనంతరమే ఈ రూట్లో నిరంతరాయంగా ట్రయల్న్ రనిర్వహిస్తామన్నారు. కాగా బుధవారం రాత్రి ప్రయోగ పరీక్ష నిర్వహించిన మెట్రో రైలుకు లోడు సామర్థ్యం, సిగ్నలింగ్, ట్రాక్,వేగం, తదితర అంశాలను పరీక్షించారు. డిపోలో నిర్వహించాల్సిన సామర్థ్య పరీక్షలను ఇప్పటికే పూర్తిచేశామని ఎల్‌అండ్‌టీ అధికారులు తెలిపారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement