Sakshi News home page

నెలాఖరులోగా పంపండి

Published Sat, Feb 11 2017 2:49 AM

సచివాలయంలో మిషన్‌ కాకతీయపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న హరీశ్‌

‘మిషన్‌ కాకతీయ’మూడో విడత ప్రతిపాదనలపై మంత్రి హరీశ్‌
మూడో విడత పనులపై సమీక్ష


సాక్షి, హైదరాబాద్‌: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్‌ కాకతీయ మూడో విడత ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా పంపాలని, తర్వాత ఎలాంటి ప్రతిపాదనలకు మంజూరు ఉండదని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. మార్చిలో వచ్చే ప్రతిపాదనలను నాలుగో విడతకు మళ్లిస్తామని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో మిషన్‌ కాకతీయపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మూడో విడతలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు పంపడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యకమంలో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం తగదని సూచించారు. మూడో విడత పనుల ప్రతిపాదనల్లో పాత మెదక్‌ జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పిన మంత్రి.. ఆ జిల్లా ఎస్‌ఈ పద్మారావు, ఇతర అధికారులను అభినందించారు.

త్వరగా ముగించండి.
మిషన్‌ కాకతీయ మొదటి, రెండో విడతల్లో చేపట్టిన పనులు, పురోగతి, కొన్ని చోట్ల పూర్తి కాకుండా ఇంకా మిగిలిపోవడానికి గల కారణాలు, ఇతర అంశాలను సైతం మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. మిషన్‌ కాకతీయ తొలి విడత కింద చేపట్టిన పనులన్నీ ఈ నెలాఖరులోగా ముగించాలని.. ఇప్పటికే రెండో విడతలో ప్రారంభించిన పనులను జూన్‌ చివరికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని సూచించారు. తెలంగాణ అంతటా ప్రతి సాగునీటి వనరు కింద వాస్తవ ఆయకట్టును నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఆయకట్టు రీ లోకలైజేషన్‌ కోసం వీలైనంత త్వరగా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని హరీశ్‌ ఆదేశించారు.

‘మిషన్‌ కాకతీయ’ అవార్డుల కమిటీ భేటీ
మిషన్‌ కాకతీయ–2 మీడియా అవా ర్డుల న్యాయనిర్ణేతల కమిటీ తొలి సమా వేశం శుక్రవారం సచివాలయంలో జరిగిం ది. జ్యూరీ చైర్మన్, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, సభ్యులు చింతల ప్రశాంత్‌రెడ్డి (రెసిడెంట్‌ ఎడిటర్, హిందూ), కట్టా శేఖర్‌రెడ్డి(ఎడిటర్, నమస్తే తెలంగాణ) తదితరులు సమావేశమై అవార్డుల  ఎంట్రీల ను పరిశీలించారు. దీనిపై వచ్చే వారం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. అనం తరం వారు మంత్రి హరీశ్‌రావుతో సమావే శమై.. అవార్డుల ఎంపిక విధివిధానాలపై చర్చించారు.

అవార్డుల ఎంపికను త్వరగా పూర్తిచేస్తే.. మార్చిలో అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి వారికి తెలిపారు. ఇక మిషన్‌ కాకతీయతో వస్తున్న ఫలితాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న పెనుమార్పులపై సాగునీటి శాఖ రూపొం దించిన డాక్యుమెంటరీని అవార్డుల కమిటీ తిలకించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపే తానికి ‘మిషన్‌’ అద్భుతంగా పనిచేస్తున్న దని మంత్రి వివరించారు. పూర్వ మహబూ బ్‌నగర్‌ జిల్లాలో కూలీల వలసలు ఆగిపో తుండడం గొప్ప మార్పన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement