ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉంది | Sakshi
Sakshi News home page

ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉంది

Published Sun, Mar 15 2015 12:00 AM

Ministers,MLC poll campaign,TRS,Telangana

నకిరేకల్ : ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించలేకపోయిన ప్రతిపక్షాలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగేహక్కు లేదని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం కోసం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో స్థానిక నారాయణ రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం రాత్రిఏర్పాటు చేసి న నియోజకవర్గ ఆత్మీయ సదస్సులో ఆయన  మాట్లాడారు. తొమ్మిది నెలల తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు నచ్చిందోలేదో అనే అంశాన్ని తెలుసుకోవడానికే ఈ ఓటు రూపేనా మీ ముందుకు వస్తున్నామన్నారు. మేధావులైన పట్టభద్రులంతా ఆలోచించి తమ ప్రభుత్వానికి అండగా నిలవాలనికోరారు. ప్రజల హక్కుల కోసం మాట్లాడని వారికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మరోవైపు తెలంగాణకు ద్రోహం చేస్తున్న టీడీపీతో బరిలో దిగిన బీజేపీకి ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
 
 కమ్యూనిస్టులకు కూడా ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.  ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. టీఆర్‌ఎస్  అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పోరాటాల చరిత్ర గల ఈ ప్రాంతంలోని పట్టభద్రులంతా తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.  భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీలు టీఆర్‌ఎస్‌లోకి వలస బాటపట్టాయన్నారు.  
 
 ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో  శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్,ఎమ్మెల్సీ పూల రవీందర్, డాక్టర్ జేఏసీ జిల్లా కన్వీనర్ రాపోలు రఘునందర్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి, ఎంపీటీసీ ఫోరం జిల్లా అద్యక్షుడు యానాల పాపిరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పూజర్ల శంభయ్య, సోమ యాదగిరి, వీర్లపాటి రమేష్, టీఆర్‌ఎస్ మండల, పట్టణ శాఖల అధ్యక్షులు పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, మాదగోని సైదులుగౌడ్, ప్రైవేట్ పీఈటీల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు మాదగోని సైదులుగౌడ్, బాణాల రాంరెడ్డి, మారుపాక నర్సయ్య, గూడూరి సుధాకర్‌రెడ్డి, బొబ్బలి శేఖర్‌రెడ్డి, పోతుల మల్లయ్య, తాటికొండ కృష్ణరెడ్డి, నర్సయ్య, మాదగోని సైదులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement