కుర్చీ తెచ్చిన వివాదం | Sakshi
Sakshi News home page

కుర్చీ తెచ్చిన వివాదం

Published Thu, Sep 11 2014 2:19 AM

MPP shortage of rooms for the allocation of special chamber

దేవరకద్ర : దేవరకద్ర జెడ్పీటీసీ సభ్యుడికి మండల పరిషత్ కార్యాలయంలో కుర్చీ కేటాయించాలని జెడ్పీసీఈఓ నుం చి ఎంపీడీఓలకు వచ్చిన ఆదేశాలు దేవరకద్రలో వివాదానికిదారితీశాయి. కుర్చీ ఏర్పాటు చేయాలంటే ఎంపీపీ అనుమతి కావాలని ఎంపీడీఓ చెప్పడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అతనిపై దాడికి దిగడంతో పాటు కార్యాలయంలోని అద్దాలు పగులగొట్టారు.దేవరకద్ర జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీకాంత్‌రెడ్డికి మండల పరిషత్‌లో ప్ర త్యేకంగా కూర్చోడానికి ఏర్పాట్లు చేయాలని గత నెల 11న జెడ్పీ సీఈఓ నుంచి మండల పరిషత్‌కు ఆదేశాలు వచ్చాయి.

అప్పటికే ఎంపీపీ కోసం ప్రత్యేక చాంబ ర్‌ను కేటాయించడంతో గదుల కొరత ఏర్పడింది. దీంతో జెడ్పీటీసీ సభ్యుడికి సకాలంలో గదిని కేటాయించలేకపో యారు. ఈ నేపథ్యంలో బుధవారం జెడ్పీటీసీ సభ్యుడితో పాటు కాంగ్రెస్ నా యకులు రాందాసు, రాఘవేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలతో పాటు పలువురు కార్యకర్తలు మండల పరిషత్ కార్యాలయాని వచ్చి జెడ్పీటీసీ సభ్యుడికి గది ఎందుకు కేటాయించలేదని ఎంపీడీఓ రాకేశ్‌రావును నిలదీశారు. గది ఏర్పాటు చేయాలంటే ఎంపీపీ అనుమతి కావాలని ఎంపీడీఓ వారికి వివరించారు.

దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కేకలు వేస్తే ఎంపీడీఓపై విరచుకుపడ్డారు. ఒక దశలో వాతవరణం ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో ఓ కార్యకర్త ఎంపీడీఓ ముందు ఉన్న అద్దాన్ని పగులగొట్టాడు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఎంపీడీఓ బయటకు వెళ్లడానికి ప్రయత్నిం చారు. దీంతో కొందరు కార్యకర్తలు అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో ఆవేదనకు గురయిన ఎంపీడీఓ రాకేశ్‌రావు నిరసనతో మండల పరిషత్ కార్యాలయం ముందు మెట్లపై కూర్చుని ధర్నాకు దిగారు.కాంగ్రెస్ నాయకులు మళ్లీ బయటకు వచ్చి గందరగోళం చేశారు.

బలవంతంగా ఎంపీడీఓను తిరిగి చాంబర్‌లోకి తీసుకెళ్లారు. చివరకు ఎస్ ఐ రాజు తన సిబ్బందితో కలిసి అక్కడి చేరుకున్నారు. అందరినీ బయటకు పం పించి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్ నా యకులు అక్కడికి వచ్చి కాంగ్రెస్ వారి తో వాగ్వాదం చేశారు. పోలీసులు జొ క్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. చివరకు కాంగ్రెస్ నాయకులు కా ర్యకర్తలు అక్కడి నుంచి వెళ్లి పోయారు.
 
సామూహిక సెలవులు పెడుతున్నాం...
జరిగిన సంఘటనకు నిరసనగా మం డల పరిషత్ సిబ్బందితో పాటు, పంచాయతీ సెక్రటరీలు అందరం గురువారం నుంచి సామూహిక సెలవు పెడుతున్నామని ఎంపీడీఓ రాకేశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా వ్యవహరించడంతో పాటు దాడి చేసే ప్రయత్నం చేశారని ఆయనఆరోపించారు. ఒక అధికారి అని కూడా చూడకుండా, కనీస మర్యాద పాటించకుండ వ్యవహరించారని తెలిపారు. ఈ విషయం పోలీసు స్టే షన్‌లో పిర్యాదు చేస్తున్నామని, అలాగే జిల్లా కలెక్టర్, జెడ్పీ సీఈఓలకు పిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement