‘పుర’లో నామినేషన్లకు రెక్కలు | Sakshi
Sakshi News home page

‘పుర’లో నామినేషన్లకు రెక్కలు

Published Wed, Apr 5 2017 2:12 AM

‘పుర’లో నామినేషన్లకు రెక్కలు - Sakshi

గరిష్ట వ్యయ పరిమితి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు 
ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపాలిటీల్లో నామినే షన్‌ పనులకు రెక్కలొచ్చాయి. మరో ఏడాది రెండేళ్లలో మునిసిపల్, సార్వత్రిక ఎన్నికలు రానుండడంతో చోటామోటా నేతలకు చేతి నిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల్లో నామినేషన్‌ పనుల నిబంధనల ను సడలించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వ శాఖలోనైనా రూ.లక్ష, ఆపై అంచనా వ్యయంగల పనులను తప్పనిసరిగా ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్ల ద్వారానే అప్పగించాలి. రూ.లక్ష, ఆలోపు పనులు నామినేషన్‌ విధానంలో అప్పగించే వీలుంది. మునిసిపల్‌ మేయర్లు, కార్పొరేట ర్లు, చైర్మన్లు, కౌన్సిలర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల్లో నామినే షన్‌ పనుల గరిష్ట వ్యయ పరిమతిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు వరకు పెంచింది.

ఈ మేరకు గత నెల 25న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులిచ్చారు. రూ.5లక్షల లోపు అత్యవసర పనులను నామినేషన్‌ మీద గుర్తిం పు పొందిన కాంట్రాక్టర్లు, స్వయం సహాయక సంఘాలు, వార్డు స్థాయి కమిటీలు, రెసిడెన్షి యల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లకు అప్పగించా లని పేర్కొన్నారు. వీరికి పనులు నామినేట్‌ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని మునిసిపల్‌ కమిషనర్, సీనియర్‌ మునిసిపల్‌ ఇంజనీర్‌ల కమిటీకి ప్రభుత్వం అప్పగిం చారు. జీహెచ్‌ఎంసీలో మాత్రం కమిషనర్, చీఫ్‌ఇంజనీర్, సంబంధిత జోనల్‌ కమిషనర్‌ తో కూడిన కమిటీకి నామినేషన్‌ పనుల అప్పగింత అధికారాన్ని కట్టబెట్టింది. నామి నేషన్ల అంచనా వ్యయంలో 5 శాతం తక్కువకు కాంట్రాక్టర్లకు పనులు నామినేట్‌ చేయాలని ప్రభుత్వం సూచించింది.

Advertisement
Advertisement