కారంపొడి చల్లి.. కత్తులతో నరికి..

13 Sep, 2014 04:44 IST|Sakshi
కారంపొడి చల్లి.. కత్తులతో నరికి..

యువకుడి దారుణ హత్య
జన్నారం : మండలంలోని పొన్కల్ గాంధీనగర్‌కు చెందిన కోట రవి(31), ఆయన భార్య గంగవ్వ తమ బంధువులతో కలిసి శుక్రవారం చింతగూడ లక్ష్మీదేవి ఆలయం వద్ద మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లారు. మొక్కులు తీర్చుకుని వంట చేసుకుని బంధువులతో కలిసి భోజ నం చేశారు. అనంతరం తిరిగి బైక్‌పై భార్యతో కలిసి ఇంటికి బయల్దేరాడు రవి. పథకం ప్రకారం మార్గంమధ్యలో కాపు కాసుకుని కూర్చున్న ఇద్దరు వ్యక్తులు వారు వస్తున్న బైక్‌ను ఆపారు. వెంటనే వారి వద్ద ఉన్న కారం పొడిని కళ్లలో చల్లారు. రవి భార్యను కొట్టి తోసివేశారు. దీంతో రవి వారి నుంచి రక్షించుకునేందుకు పరుగులు తీశాడు. అయినా రవిని వదలకుండా వెంట పడి సమీపంలోని పత్తి చేలలో పట్టుకుని వేట కత్తితో నరికారు.

గుండెపై, తలపై నరకడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన చేలలో ఉన్న మహిళలు ఇళ్లకు పరుగులు తీశారు. కాసేటపటికి తేరుకున్న భార్య అక్కడికి వెళ్లి చూడగా రవి విగతజీవుడై ఉన్నాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడే ఉన్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రదేశం రోదనలతో మార్మోగింది. మృతుడికి భార్య, కూతురు కల్పన, కుమారుడు అజయ్ ఉన్నారు. మంచిర్యాల డీఎస్పీ రమణకుమార్, లక్సెట్టిపేట సీఐ సతీశ్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక ఎస్సై బుద్దే స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
ఉలిక్కిపడ్డ జన్నారం
ఫ్యాక్షనిజాన్ని తలపించేలా సాయంకాలం 5 గంటలకు చుట్టూ పరిసరాల్లో జనం ఉండగానే యువకుడిని తరి మితరిమి కత్తితో నరికి హత్య చేయడంతో జన్నారం ఉలి క్కిపడింది. ఇంత దారుణ హత్య జన్నారం మండలంలో మొదటిసారిగా జరగడం గమనార్హం. కాగా, రవి ప్రైవే ట్ వ్యాపారం చేసేవాడు. ఇటీవల ఒక రెడీమెడ్ దుకా ణం పెట్టి తీసేశాడు. ఇటీవలే ఎన్‌ఎస్‌యూఐలో చేరి సా మాజిక  కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంతలోనే హత్యకు గురవడాన్ని స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా