గులాబీ దళమిదీ.. | Sakshi
Sakshi News home page

గులాబీ దళమిదీ..

Published Tue, Jun 3 2014 4:49 AM

గులాబీ దళమిదీ.. - Sakshi

తెలంగాణ తొలి కేబినెట్‌లో సచివులు
 మొహమ్మద్ మహమూద్ అలీ
 స్వస్థలం    :    హైదరాబాద్
 వయసు    :    61
 విద్యార్హతలు    :    బీకాం
 కుటుంబం    :    భార్య నస్రీన్ ఫాహిమా, కుమారుడు
 మొహమ్మద్ ఆజమ్ అలీ, కూతుళ్లు ఫిర్దోస్ ఫాతిమా, అఫ్రోస్ ఫాతిమా
 పార్టీలో హోదా    :    టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షులు
 రాజకీయ నేపథ్యం    :    టీఆర్‌ఎస్ ఆవిర్భావం (2001) నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పార్టీలో మంచి గుర్తింపు. 2007లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2009లో పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి. 2010లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు. 2013 ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా  ఎంపిక
 
పోచారం శ్రీనివాసరెడ్డి
అసలు పేరు    :    పరిగె శ్రీనివాస్‌రెడ్డి
 స్వస్థలం    :    నిజామాబాద్ జిల్లా పోచారం (ఊరు పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు)
 వయసు    :    65
 విద్యార్హతలు    :    బీఈ (డిస్కంటిన్యూడ్)
 నియోజకవర్గం    :    బాన్స్‌వాడ
 కుటుంబం    :    భార్య పుష్ప, కుమారులు రవీందర్‌రెడ్డి,     సురేందర్‌రెడ్డి, భాస్కర్ రెడ్డి, కూతురు అరుణ.
 రాజకీయ నేపథ్యం    :    1978లో దేశాయిపేట సింగిల్‌విండో చైర్మన్, 1981లో ఎల్‌ఎంబీ డెరైక్టర్, 1987లో డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. 1987, 1993-1997, 2005 -2007లలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, 1992లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు. 1994, 1999లలో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపు. 1998లో గృహ నిర్మాణ శాఖ మంత్రి, 1999-2000లో భూగర్భ గనుల శాఖ మంత్రిగా, 2001-02లో గ్రామీణ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2002లో స్టేషనరీ కుంభకోణం వెలుగుచూడడంతో నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి. 2009లో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపు. తెలంగాణ కోసం 2011లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం. 2014 ఎన్నికల్లోనూ గెలుపు.
 
 జోగు రామన్న
 స్వస్థలం    :    ఆదిలాబాద్ జిల్లా
         జైనథ్ మండలం దీపాయిగూడ
 వయసు    :    50
 విద్యార్హతలు    :    ఇంటర్
 నియోజకవర్గం    :    ఆదిలాబాద్
 కుటుంబం    :    భార్య రామక్క, కుమారులు ప్రేమేందర్, మహేందర్
 రాజకీయ నేపథ్యం    :    1984లో టీడీపీలో చేరిక. 1985-1996 వరకు జైనథ్ మండల టీడీపీ ప్రధాన కార్యదర్శిగా, 1987-88 వరకు మండల టీడీపీ అధ్యక్షునిగా బాధ్యతలు. 1988 నుంచి 1995 వరకు దీపాయిగూడ సర్పంచ్‌గా ఉన్నారు. 2004లో టీడీపీ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి. 2009 ఎమ్మెల్యేగా గెలుపు. 2011లో టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిక. 2012 ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా విజయం. 2014లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపు.
 
 తాటికొండ రాజయ్య
స్వస్థలం    :    స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్
 వయసు    :    54
 విద్యార్హతలు    :    ఎంబీబీఎస్, డీసీహెచ్
 తల్లిదండ్రులు    :    లచ్చమ్మ, వెంకటయ్య
 కుటుంబం    :    భార్య ఫాతిమా మేరీ, కుమారులు
         {M>…తి రాజ్, విరాజ్ (ఇద్దరూ డాక్టర్లు)
 రాజకీయ నేపథ్యం    :    1995లో రాజకీయ అరంగేట్రం చేశారు. డీసీసీ కార్యదర్శి (1995-2001), డీసీసీ ఉపాధ్యక్షుడు (2001-2005), పీసీసీ సభ్యుడు (2001-2009), స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే (2009-14)గా బాధ్యతలు నిర్వర్తించారు. 1990 నుంచి ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు.
 
 ఈటెల రాజేందర్
 స్వస్థలం    :    కరీంనగర్ జిల్లా కమలాపూర్
 వయసు    :    50
 విద్యార్హతలు    :    బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ
 నియోజకవర్గం    :    హుజూరాబాద్
 కుటుంబం    :    భార్య జమున,  కుమారుడు నితిన్,     కూతురు నీతా
 రాజకీయ నేపథ్యం    :    విద్యార్థి దశలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2002లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా రాజకీయ అరంగేట్రం. 2004లో కమలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక, టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేతగా నియామకం. 2008 ఉప ఉన్నికల్లో విజయం, టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా నియామకం. 2009 సాధారణ ఎన్నికలు, 2010 ఉప ఎన్నికల్లో, 2014 సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం.
 
 టి.హరీశ్‌రావు
 స్వస్థలం    :    కరీంనగర్ జిల్లా తోటపల్లి
 వయసు    :    42
 విద్యార్హతలు    :    బీఏ
 నియోజకవర్గం    :    మెదక్ జిల్లా సిద్దిపేట
 కుటుంబం    :    భార్య శ్రీనిత,  కుమారుడు అర్చిష్మాన్, కూతురు వైష్ణవి
 రాజకీయ నే పథ్యం    :    1996 నుంచి కేసీఆర్‌కు సహాయకుడిగా, 2004లో సిద్దిపేట నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. 2004లో వైఎస్ మంత్రివర్గంలో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా, 2009 నుంచి 2014 వరకు టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేతగా బాధ్యతలు.
 
 కె.తారక రామారావు
 స్వస్థలం    :    హైదరాబాద్, వయసు  :    38
 తల్లిదండ్రులు    :    శోభ, చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)
 విద్యార్హతలు        :    ఎంబీఏ, నియోజకవర్గం : సిరిసిల్లా
 కుటుంబం    :    భార్య శైలిమ, కుమారుడు హిమన్షు, కూతురు అలేఖ్య.
రాజకీయ నేపథ్యం    :    2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నిక, 2010 ఉప ఎన్నికల్లోనూ, 2014లోనూ భారీ విజయం.
 
 నాయిని నరసింహారెడ్డి
 స్వస్థలం    :    నల్లగొండ జిల్లా నేరేడుగమ్ము
 వయసు    :    74
 విద్యార్హతలు    :    హెచ్‌ఎస్‌సీ
 నియోజకవర్గం    :    ఎన్నికల్లో పోటీ చేయలేదు
 కుటుంబం    :    కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమత.
 రాజకీయ నేపథ్యం    :    కార్మిక నేతగా హైదరాబాద్‌లో మంచి గుర్తింపు. 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. మొదటి ప్రయత్నంలోనే ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపు. 1985లో జనతాదళ్ తరపున విజయం. 2004లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మూడోసారి గెలుపు. వైఎస్ మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖమంత్రిగా బాధ్యతలు.
 
 జి.జగదీష్‌రెడ్డి
 స్వస్థలం    :    నల్లగొండ జిల్లా నాగారం గ్రామం
 వయసు    :    49
 విద్యార్హతలు    :    బీఏ బీఎల్
 నియోజకవర్గం    :    సూర్యాపేట
 కుటుంబం    :    భార్య సునీత, కుమారుడు వేమన, కూతురు లహరి
 రాజకీయ నేపథ్యం    :    విద్యార్థి నాయకుడిగా 1982 నుంచి 1990 వరకు సూర్యాపేటలో పీడీఎస్‌యూలో ఆర్గనైజర్‌గా పనిచేశారు. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరిక. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా ఉన్నారు. 2009లో టీఆర్‌ఎస్ తరఫున హుజూర్‌నగర్ స్థానానికి పోటీ చేసి ఓటమి. 2014లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపు.
 
 పి.మహేందర్‌రెడ్డి
 స్వస్థలం    :    గొల్లూరుగుడ, షాబాద్ మం., రంగారెడ్డి
 వయసు    :    50
 విద్యార్హతలు    :    బీవీఎస్సీ (వెటర్నరీ)
 నియోజకవర్గం    :    తాండూరు.
 కుటుంబం    :    భార్య సునీతారెడ్డి (మాజీ జెడ్పీ చైర్‌పర్సన్, ప్రస్తుతం యాలాల జెడ్పీటీసీ), కుమారులు మనీష్‌రెడ్డి, రినేష్‌రెడ్డి
 రాజకీయ ప్రస్థానం    :    1989లో జిల్లా టీడీపీ యూత్ అధ్యక్షుడిగా రాజకీయ అరంగేట్రం. 2014లో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిక. ఎమ్మెల్యేగా ఐదుసార్లు పోటీ. 1994, 1999, 2009, 2014 నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపు. 2004లో ఓటమి.
 
 టి.పద్మారావు

 స్వస్థలం    :    హైదరాబాద్
 వయసు    :    60,       
 విద్యార్హతలు      :   ఇంటర్
 కుటుంబం    :    భార్య స్వరాజ్య,  నలుగురు కుమారులు, ఇద్దరు  కూతుళ్లు
 నియోజకవర్గం    :    సికింద్రాబాద్
 రాజకీయ నేపథ్యం    :    దివంగత పి.జనార్దన్‌రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం. 1986లో హిస్సాంగంజ్ మోండాకార్పోరేటర్‌గా పోటీ చేసి ఎంసీహెచ్ పాలకమండలిలో అడుగుపెట్టారు. 2002లో అదే స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం, పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా బాధ్యతలు. 2004లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపు. తర్వాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల రాజీనామా అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి. 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి విజయం.

Advertisement
Advertisement