‘ఓపీ’క ఉంటే రండి! | Sakshi
Sakshi News home page

‘ఓపీ’క ఉంటే రండి!

Published Tue, Aug 5 2014 3:58 AM

Opie services NIMS eclipse

  •      నిమ్స్‌లో ఓపీ సేవలకు గ్రహణం
  •      రోజుల తరబడి రోగుల పడిగాపులు
  •      సమయానికి రాని వైద్యులు
  • సాక్షి, సిటీబ్యూరో: వైద్యం కోసం అవుట్ పేషెంట్ విభాగానికి  వచ్చే రోగులకు నిమ్స్ వైద్యులు చుక్కలు చూపిస్తున్నారు. మెరుగైన వైద్యం సంగతి దేవుడెరుగు... కనీసం ఓపీ సేవలూ సక్రమంగా అందడం లేదు. రాజకీయ పలుకుబడి ఉన్న ‘పెద్ద ల’కు, బడా వ్యక్తులకు ఎర్రతివాచీ పరుస్తున్న వైద్యులు సుదూర ప్రాంతాల నుంచి ఓపీకి చేరుకునే సాధారణ, మధ్య తరగతి రోగులను కనీసం పట్టించుకోవడం లేదు.

    నిజానికి అవుట్ పేషెంట్ విభాగానికి ఉదయం 8.30 గంటలకు చేరుకుంటే... వైద్యుడు రాసిన పరీక్షలన్నీ చేయించుకుని, సాయంత్రానికల్లా మందులు తీసుకొని ఇంటికి చేరుకోవాల్సిన రోగులు రెండు రోజుల పాటు ఓపీలోనే పడిగాపులుకాయాల్సి వస్తోంది.  సకాలంలో వైద్యులు రాకపోవడం, ఒకవేళ వచ్చినా మెడికల్ రిపోర్టులు సమయానికి అందకపోవడం వ ంటి కారణాలతో సేవలు జాప్యమవుతున్నాయి.
     
    తప్పని నిరీక్షణ
     
    సుమారు వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి నిత్యం 1500 మంది రోగులు వస్తుంటారు. వీరిలో రోజుకు సగటున 100-150 మంది అడ్మిట్ అవుతుంటారు. మిగతా విభాగాలతో పోలిస్తే, ఆర్థో, న్యూరో సర్జరీ, యూరాలజీ, గుండె జబ్బుల విభాగాలకు రోగుల తాకిడి ఎక్కువ.

    తలకు బలమైన గాయాలై ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రులు, పక్షవాతంతో బాధ పడుతున ్న రోగులకు ఆస్పత్రిలో అడ్మిషన్ కూడా దొరకడం లేదు. న్యూరో సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆరోగ్యశ్రీ రోగులను ప్రైవేటు ఆస్పత్రులు చేర్చుకోకపోవడంతో వీరంతా నిమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వైద్యం చేయించుకోవాలంటే 15నుంచి నెల రోజుల పాటు ఎదురు చూడాల్సి వ స్తోంది.

    ఇలా ఇప్పటికే 300 మందికిపైగా సర్జరీల కోసం ఎదురు చూస్తున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. దీంతో కొత్తగా ఎవరైనా వస్తే చేర్చుకోవడం లేదు. ఇక దెబ్బతిన్న వెన్నుపూస జాయింట్లను సరిచేయాలంటే సియరమ్ అనే వైద ్య పరికరం అవసరం. ఆస్పత్రిలోని ఈ పరికరం నెలరోజుల క్రితం పాడైంది. మరమ్మతుల విషయమై సంబంధిత విభాగం వైద్యులు పట్టించుకోవడం లేదు.  
     
    గుండెను పిండేస్తున్న నిర్లక్ష్యం
     
    కార్డియాలజీ విభాగంలో శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన వైద్య పరికరం తమ వద్ద లేదని చెబుతూ రోగులను చేర్చుకోకుండా తిప్పి పంపుతున్నారు. అడపా దడపా చేర్చుకున్నా సకాలంలో శస్త్ర చికిత్స చేయకపోవడంతో హృద్రోగంతో బాధ పడుతున్న వారు ఆస్పత్రిలోనే మృత్యువాత పడుతున్నారు. ఇక యూరాలజీ విభాగంలో రోగుల సంఖ్యకు సరిపడే వైద్యులు లేకపోవడంతో చికిత్సల్లో తీవ్ర జాప్యం తప్పడం లేదు. దాదాపు ప్రతి విభాగంలోనూ ఏదో సమస్య ఎదురవుతుండడంతో ఓపీకి వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు.
     

Advertisement
Advertisement