మాధారంలో మద్యం నిషేధం | Sakshi
Sakshi News home page

మాధారంలో మద్యం నిషేధం

Published Sun, Sep 6 2015 3:09 AM

మాధారంలో మద్యం నిషేధం

-  విక్రయిస్తే జరిమానా,ప్రభుత్వం పథకాలు రద్దుచేయూలని తీర్మానం
- అమ్మకందారులకు నోటీసులు
మాధారం (రఘునాథపల్లి) :
మండలంలోని మాధారంలో బెల్టుషాపులు, గుడుంబా నివారణకు గ్రామస్తులు నడుంబిగించారు. శనివారం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ బాల్నె అనురాధ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు, కుల పెద్దలు, మహిళా సంఘాల అధ్యక్షులు సమావేశమయ్యారు. గ్రామంలో బెల్టుషాపులు, గుడుంబా విక్రయిస్తే జరిమానాలతో పాటు ప్రభుత్వ పథకాలు పూర్తిగా నిలిపి వేయాలని నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి గ్రామంలో మద్య నిషేధం అమల్లోకి తేవాలని పకడ్బంధీగా అమలయ్యేలా నిషేధ కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించారు.

గ్రామంలో ఎవరైనా బెల్టు షాపు నిర్వహిస్తే రూ 20 వేల జరిమానా, గుడుంబా అమ్మితే రూ 10 వేలు, తాగిన వారికి రూ 5 వేల జరిమానా విధించాలని తీర్మానం చేశారు. ప్రస్తుతం బెల్టు షాపులు నిర్వహిస్తున్న నలుగురికి, గుడుంబా అమ్ముతున్న ఆరుగురికి గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు తయారు చేసి స్వయాన నూతనంగా ఎంపికైన నిషేధ కమిటీ  సభ్యులు వారి వద్దకు వెళ్లి అందించారు. గ్రామస్తుల నిర్ణయాన్ని ధిక్కరించి మద్యం అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామాఖ్య సంఘం అధ్యక్షురాలు ఉమ్మగోని సరిత, సీఏ కర్ల పద్మ, టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మగోని నర్సయ్య, బాల్నె భిక్షపతి, అరూరి బాలస్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement