నాణ్యమైన సేవలందించాలి  | Sakshi
Sakshi News home page

నాణ్యమైన సేవలందించాలి 

Published Sat, Mar 24 2018 11:00 AM

Provide better medicine - Sakshi

జైనథ్‌(ఆదిలాబాద్‌): సమయానుసారం పీహెచ్‌సీలో అందుబాటులో ఉంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె ఆకస్మికంగా మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేశారు. వార్డ్, లేబర్‌ రూం, ఆపరేషన్‌ థియేటర్, స్కానింగ్‌ మెషిన్, మందుల గదిని పరిశీలించారు. యాంటీ స్నేక్‌ వీనం, యాంటీ రేబీస్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయా? అని ప్రత్యేకంగా ఫార్మసిస్ట్‌ రవీందర్‌ను అడిగారు. పీహెచ్‌సీకి స్టాఫ్‌ నర్స్‌ పోస్ట్‌ లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందని, వైద్యురాలు చైతన్య స్రవంతి ఆమెకు విన్నవించారు. త్వరలోనే పోస్ట్‌ మంజూరుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పీహెచ్‌సీని రౌండ్‌ ది క్లాక్‌గా మార్చాలని విన్నవించారు. పాత భవనం శిథిలావస్థకు చేరినందున కొత్త భవనం మంజూరు చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు.

విధులపై నిర్లక్ష్యం వహించరాదు..
కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ పీహెచ్‌సీని తనిఖీ చేసిన తరువాత, డీఎంహెచ్‌వో సైతం ప్రత్యేకంగా సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. జూనియర్‌ అసిస్టెంట్‌ లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. విధులు సక్రమంగా నిర్వహించని వారిని ఉపేక్షించేది లేదని, కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట సూపర్‌వైజర్‌ సుభాష్, ఇతర సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement