గోడౌన్లు వెంటనే నిర్మించాలి | Sakshi
Sakshi News home page

గోడౌన్లు వెంటనే నిర్మించాలి

Published Fri, Apr 8 2016 2:58 AM

గోడౌన్లు వెంటనే నిర్మించాలి - Sakshi

 మంత్రి హరీష్‌రావు
 
కరీంనగర్ : మంజూరైన గోడౌన్లను వెంటనే నిర్మించాలని రాష్ర్ట భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.1,024 కోట్లతో 330 గోడౌన్లకు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందన్నారు. మొదటి విడత మంజూరైన 128 గోడౌన్లను ఈనెలాఖరులోగా, రెండో విడతలోని 202 గోడౌన్లను జూలై నెలాఖరులోగా పూర్తి చేయూలని సూచించారు. స్థల సేకరణ సమస్య ఉన్న చోట వారంలోగా పరిష్కరించాలని, లేకుంటే ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ప్రధాని దేశవ్యాప్తంగా ప్రారంభించబోతున్న మార్కెట్ల అనుసంధానంలో రాష్ట్రానికి చెందిన 44 మార్కెట్లు ఉన్నాయన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ఏకీకృత లెసైన్స్, ఆన్‌లైన్ మార్కెట్ సదుపాయంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. రెండో విడత మిషన్‌కాకతీయను విజయవంతం చేయూలని కోరారు. పారిశ్రామిక వేత్తలు, ప్రవాసభారతీయులను చెరువులు దత్తతకు ప్రోత్సహించాలని, డీఎస్పీలు కనీసం ఒక చెరువు దత్తత తీసుకోవాలన్నారు.

కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ జమ్మికుంట, సైదాపూర్ గోడౌన్ల పనులు త్వరలోనే చేపడతామన్నారు. ప్రాజెక్టుల భూసేకరణ సంది చర్చల ద్వార పూరి ్తచేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ జోయల్‌డేవిస్ మాట్లాడుతూ చెరువులను దత్తత తీసుకునే విషయం వారంలోగా కార్యాచరణ రూపొం దించి పంపిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అడిషనల్ ఎస్పీ అన్నపూర్ణ, ప్రత్యేక భూసేకరణ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు, నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement