ఏసీబీ వలలో చిక్కిన ఎస్‌ఐ | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో చిక్కిన ఎస్‌ఐ

Published Fri, Aug 7 2015 4:11 AM

SI ensnared in the trap ACB

రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
ఆటో యజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన మాడ్గుల సబ్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసు
 
 మాడ్గుల : రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదం కేసులో ఓ ఆటో యజమాని నుంచి మాడ్గుల ఎస్‌ఐ శ్రీనివాసు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా గురువారం ఏ సీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నా రు. ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ్ విలేకరు ల సమావేశంలో తెలిపిన వివరాల ప్ర కారం.. మాడ్గుల మండలం నాగిళ్లకు చెం దిన ఆటో యజమాని అనంతుల రాంజీ జూలై 14ననల్గొండ జిల్లా మాల్ నుంచి తన ఆటోలో వస్తూ మండలంలోని గుడితండా సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదం లో ముగ్గురికి గాయాలయ్యాయి.

బాధితుల ఫిర్యాదు మేరకు ఆటో యజమాని అనంతుల రాంజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయాలైన ముగ్గురికి ఆటో యజమాని రాంజీ చికిత్స నిమిత్తం ఖర్చయిన డబ్బులతోపాటు నష్టపరిహారం కూడా చెల్లించాడు. అయినప్పటికీ ఈ కేసు విషయంలో ఎస్‌ఐ శ్రీనివాసు రాంజీని రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిమాండు చేశాడు. దీంతో రాంజీ రూ.5 వేలు ఇస్తానని ఒప్పుకుని.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎస్‌ఐ శ్రీనివాస్ తన గదిలో ఉండగా రాంజీ సాయంత్రం 5.30 గంటలకు గదివద్దకు చేరుకుని, ఎస్‌ఐకి రూ.5 వేలు ఇవ్వ జూపగా.. ఇంటిముందున్న మోటారు సైకిల్ కవరులో పెట్టమని సూచించాడు. దీంతో రాంజీ ఆరుబయట ఉన్న మోటారుసైకిలు కవరులో రూ.5 వేల నగదును పెట్టాడు. పక్కనే మాటు వేసిన ఉన్న ఏసీబీ అధికారులు ఎస్‌ఐ శ్రీనివాసుతోపాటు అతని మోటారుసైకిలును అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. మోటారు సైకిలు కవరులో రాంజీ పెట్టిన రూ.5 వేలతోపాటు మరో రూ.4వేలు పట్టుబడ్డాయి. అనంతరం ఏసీబీ అధికారులు ఎస్ శ్రీనివాసును విచారించారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తన సెల్: 94913 05609నంబర్‌కు ఫోన్ చేయాలని ఏసీబీ డీఎస్పీ రాందాసుతేజ్ సూచించారు. ఈ దాడిలో సీఐలు గోవింద్‌రెడ్డి, ప్రతాప్, నవీన్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement