కొత్త కొత్వాల్ మహేందర్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

కొత్త కొత్వాల్ మహేందర్‌రెడ్డి

Published Thu, May 29 2014 3:36 AM

కొత్త కొత్వాల్ మహేందర్‌రెడ్డి - Sakshi

  •      జూన్ 2న బాధ్యతలు స్వీకరించే అవకాశం
  •       1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి
  •  సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రాజధానికి కొత్త పోలీస్ కమిషనర్‌గా ఎం.మహేందర్‌రెడ్డి పేరు ఖరారైంది. జూన్ 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటలకే  మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేందర్‌రెడ్డిని కొత్వాల్‌గా నియమించే అంశంలో ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడికి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఆయన నియామకానికి మార్గం సుగమమైనట్లు  తెలిసింది.

    ప్రస్తుత నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ఎంపిక కావడంతో ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలను కాపాడే సమర్ధవంతులైన ఐపీఎస్ అధికారి ఎవరనే విషయంలో పలుమార్లు ఉన్నతస్థాయిలో అధికారులు తర్జనభర్జన పడ్డారు. అయితే చివరకు మహేందర్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలిసింది. అయితే  ఎం.రవీందర్ బంద్‌కు మద్దతు తెలిపారు.  బంద్‌లో తామూ పాల్గొంటున్నట్లు తెలంగాణా విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
     
    బంద్‌కు మద్దతు..
     
    అఫ్జల్‌గంజ్: తెలంగాణ బంద్‌కు సంపూర్ణమద్దతునిస్తున్నట్లు  తెలంగాణ మజ్దూర్‌యూనియన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్.బి.రెడ్డి, తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎస్ నాగరాజు, తెలంగాణ వ్విశ్వవిద్యాలయాల ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపాయి.
     
    ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా..
     
    ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ సర్వీసులు గురువారం యథాతథంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  పోలీసులసూచన మేరకు ఆయా రూట్లలో బస్సులు నడుపుతామని గ్రేటర్ జోన్ ఈడీ కోటేశ్వరరావు స్పష్టం చేశారు. జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయి. నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లు షెడ్యూలు ప్రకారమే నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రజాసంబంధాల అధికారి సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు.
     

Advertisement
Advertisement