Sakshi News home page

అక్రమ దందాను ఆపివేయాలి

Published Fri, Sep 4 2015 11:00 PM

Stop illegal dandanu

 నకిరేకల్ : అధికారిక పేరుతో అక్రమంగా ఇసుక దందా కొనసాగుతోందని, తక్షణమే ఆపివేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. నకిరేకల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాలిగౌరారంమండలంవంగమర్తి సమీపంలోని మూసీనది నుం డి అధికారికంగా ఇసుక క్వారీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. అధికార పార్టీ పెద్ద నేతల అండదండలతోనే ఈ అక్రమ రవాణా దందా జోరుగా సాగుతుందని ఆరోపించారు. 20 టన్నులు ఇసుక వెళ్లాల్సి ఉండగా 35 నుండి 45 టన్నుల మేర  ఇసుకను లారీలలోకి ఎత్తి తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా లారీల రవాణాతో గ్రామీణ రహదారులన్ని పూర్తిగా పాడవుతున్నాయన్నారు.

మూసీనదిలో అధికారికంగా తెరిచిన ఇసుక క్వారీని తక్షణమే ఎత్తివేసి అక్రమ రవాణాను కట్టడి చే యాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని హె చ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు ఎండి మహబుబ్ అలీ,యాస కార్ణకర్‌రెడ్డి ఎంపీటీసీ గుర్రంగణేష్,నాయకు లు పన్నాల రాఘవరెడ్డి, రాచకొండ సైదులు, సుంకరబోయిన నర్సింహ,గందమల్ల జానయ్య,ఆరుట్ల శ్రవణ్, వంటెపాక జాని, కర్ణాకర్, గుండ్లపల్లి యాదగిరి, పల్లె విజయ్, చౌగోని లక్ష్మణ్, దాసరి సైదులు, ఈదుల్ల వెంకరమణ, ఉదయ్ పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement