Sakshi News home page

ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోండి

Published Tue, Feb 2 2016 4:28 AM

ఉపాధ్యాయుడిపై   చర్యలు తీసుకోండి

 టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సుధాకర్‌రెడ్డి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, తనపై దాడి చేశారని సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. అంతేగాక గ్రామ సభకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని సర్పంచ్‌తో పాటు ఎంపీటీసీ, వార్డు సభ్యులు ఎస్పీ సుమతికి ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్‌లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ బి.సుమతి ఫిర్యాదులు స్వీకరించారు. ఎల్లుపేటలో ఉపాధ్యాయుడు సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని  వారు ఎస్పీని కోరారు.


తన భర్త అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడని, లేకుంటే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నారని మెదక్ మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన సుంకరి శోభారాణి ఆరోపించారు. తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరారు. మద్యం సేవించి తమపై దాడి చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన పద్మ కోరారు. తన భర్త రెండో పెళ్లి చేసుకొని తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, ఆయనతో పాటు పక్కింటి వారు, అత్త వేధింపులకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పుల్కల్ మండలం కోర్పోల్‌కు చెందిన సురేఖ కోరారు.

Advertisement

What’s your opinion

Advertisement