మరి ప్రజల మొక్కుల సంగతేంటి? | Sakshi
Sakshi News home page

మరి ప్రజల మొక్కుల సంగతేంటి?

Published Thu, Feb 23 2017 4:08 AM

మరి ప్రజల మొక్కుల సంగతేంటి? - Sakshi

సీఎం కేసీఆర్‌కు తమ్మినేని ప్రశ్న

సాక్షి, సూర్యాపేట:  దేవుళ్ల మొక్కులు  తీరుస్తున్న సీఎం కేసీఆర్‌.. ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి మర్చిపోవడం శోచనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తన మొక్కులు తీర్చేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేయ కుండా ఫాంహౌస్‌లో పండించిన పంటలు అమ్మి ఆభరణాలు చేయించాలని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం రావడంలో కీలక పాత్ర పోషించిన కోదండ రాంనే అరెస్టు చేసి జైలుకు తరలించడం తెలంగాణ ప్రజలకే అవమానం అన్నారు.   మార్చి19న హైదరాబాద్‌లో పాదయాత్ర ముగింపు సభ ఉంటుందని తెలిపారు.  

మోతె ప్రజల కోరికను తీర్చాలి: సీఎంకు తమ్మినేని లేఖ
సాక్షి, హైదరాబాద్‌: సూర్యాపేట జిల్లా మోతె మండల ప్రజల చిరకాల కోరికైన సాగునీటి పథకాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. సిరికొండ చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే అక్కడి నుంచి మండలంలోని ఏడు చెరువులను నింపే అవకాశం ఉందన్నారు.

Advertisement
Advertisement