అదుపు తప్పి.. పొలాల్లో 100 మీటర్ల లోపలికి దూసుకెళ్లి.. | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి.. పొలాల్లో 100 మీటర్ల లోపలికి దూసుకెళ్లి..

Published Mon, Nov 11 2019 8:19 AM

Tandur Depo Bus Slips Off Road At Pudur - Sakshi

సాక్షి, చేవెళ్ల: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అధికారులు ప్రైవేటు డ్రైవర్లను పెట్టి బస్సులను నడిపిస్తున్నారు. అయితే, వీరికి అనుభవం లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం హైదరాబాద్‌ నుంచి తాండూరు వైపు వెళ్తున్న తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(ఏపీ 29జడ్‌3608) పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి గేట్‌ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డుకిందకు దిగి పంట పొలాల్లోకి వెళ్లింది.  దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా కేకలు పెట్టారు. సుమారు 100 మీటర్ల లోపలికి వెళ్లి ఆగింది. రోడ్డు పక్కన పొలం చదునుగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా తీవ్ర భయాందోళనతో ఒక్కసారిగా కిందకు దిగారు. కొందరు ప్రయాణికులు కిటికీల నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత వేర్వేరు వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.    

Advertisement
Advertisement