Sakshi News home page

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Published Wed, Feb 27 2019 10:22 AM

Telangana Intermediate Exams Nalgonda - Sakshi

నల్లగొండ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించి ఇంటర్‌ విద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 36,362 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం 16,823 మంది ఉండగా, ద్వితీ య సంవత్సరం 19539 మంది ఉన్నా రు. మొత్తంగా 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పరీక్ష సామగ్రిని ఆయా కేంద్రాలకు పంపించారు. ప్రశ్నపత్రాలను మాత్రం సంబంధిత కేంద్రాల పరిధిలోని పోలీస్‌ స్టేషన్లలో భద్రపరిచారు. మొదటి రోజు బుధవారం ప్రథమ సంవత్సరం విద్యార్థులు సెకండ్‌ లాగ్వేజీ(తెలుగు) 1వ పేపర్‌ రాయనున్నారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

అన్ని ఏర్పాట్లు పూర్తి
పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కేంద్రాల్లో అవసరమైన వసతులను కల్పించడంతోపాటు విద్యార్థులకు అవసరమైన బెంచీలను సమకూర్చారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలులోకి తీసుకురానున్నారు. ప్రథమ చికిత్స కోసం వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. బుధవారం జరిగే పరీక్షకు సంబంధించి మంగళవారం సాయంత్రం వరకు నంబరింగ్‌ను పూర్తి చేశారు.

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
విద్యార్థులు పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోరు. దీనిని దృష్టిలో పెట్టుకుని గంటముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. 9 గంటల నుంచి 12గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. ఉదయం 8గంటల నుంచే పరీక్షకేంద్రాలకు విద్యార్థులను అనుమతిస్తున్నందున ముందే చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నందున విద్యార్థులు ముందుగానే చేరుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.

ఉదయం హైదరాబాద్‌లో ప్రశ్నపత్రం ఎంపిక
ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించి ప్రతి సబ్జెక్ట్‌కు ఏ, బీ, సీ అనే మూడు ప్ర శ్నపత్రాలను తయారు చేసి ఇప్పటికే అ న్ని కేంద్రాల పరిధిలోని పోలీస్‌ స్టేషన్లలో భద్రపర్చారు.  బుధవారం జరిగే పరీక్షకు సంబంధించి హైదరాబాద్‌లో ఉదయం 8.30గంటలకు విద్యాశాఖ మంత్రి, ఇం టర్‌ విద్యా కమిషనర్, ఇతర అధికారులు ఏ, బీ, సీ ప్రశ్నపత్రాల్లో ఏ దో ఒకదానిని డ్రా ద్వారా తీస్తారు. అందులో వచ్చిన ప్రశ్నపత్రం వివరాలను పరీక్ష కేంద్రాల్లోని పోలీస్‌ స్టేషన్లకు ఎస్‌ఎంఎస్, వైర్‌లెస్‌ ద్వారా సమాచారాన్ని అందిస్తారు. ఆయా ఆ ప్రశ్నపత్రాలనే పరీక్ష కేంద్రాలకు 15 నిమిషాల్లో చేరవేస్తారు.

కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు చేసుకోకుండా గట్టి పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే  స్క్వాడ్లు కేసులు బుక్‌ చేయనున్నారు. బయటి నుంచి చిట్టీలు అందిస్తే పోలీసులు వారిపై కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.  

Advertisement

What’s your opinion

Advertisement