విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి

7 Jan, 2019 03:55 IST|Sakshi

స్తంభాలు నిలబెడుతుండగా విద్యుత్‌ సరఫరా 

ఇద్దరు రైతులు, ఒక కూలీ మృతి

ఐదుగురికి గాయాలు

వేమనపల్లి(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు, ఒక కూలీ విద్యుత్‌ షాక్‌తో మృత్యువాత పడ్డారు. ఆదివారం ట్రాన్స్‌కోలో పనిచేసే దినసరి కూలీ వశాఖ భీంరావు సహాయంతో రైతులు స్తంభాలు నిలబెడుతుండగా అదే స్థలంలో పైనుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్‌ వైర్లకు తగలడంతో ప్రమాదవశాత్తు విద్యుత్‌ సరఫరా అయ్యింది. దీంతో రైతులు చిన గొండె రామన్న (60), ఆయన తమ్ముడి కొడుకు చిన గొండె సురేందర్‌ (22)తోపాటు కూలీ భీంరావ్‌ (25) అక్కడికక్కడే మృతి చెందారు. స్తంభాన్ని తాడుతో పట్టుకున్న ఇతర కూలీలు.. తేర్కరి లచ్చన్న, రామగిరిపున్నం, జంబోజి వెంకటస్వామిలకు తీవ్రగాయాలు కాగా బోర్కుటి పరదేశి, కోండ్ర రమేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని వైద్యం నిమిత్తం మంచిర్యాల ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాలతో ఆందోళన
రైతుల మరణానికి కారణమైన అధికారులు, విద్యుత్‌ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని గ్రామానికి చెందిన రైతులు, రాజకీయ నాయకులు మృతదేహాలతో ఆందోళనకు దిగారు. రైతుల పొలాలకు గతేడాది విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరైంది. అధికారులు ఆరు నెలల క్రితం ట్రాన్స్‌ఫార్మర్‌ ఇచ్చారు. అయితే విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వకపోవటంతో రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. 15 రోజుల క్రితం స్తంభాలు ఇవ్వటంతో పొలాల వద్దకు తీసుకెళ్లారు. నిబంధనల మేరకు కాంట్రాక్టర్‌ విద్యుత్‌ లైన్‌ వేయాల్సి ఉన్నప్పటికీ, కాలయాపన చేస్తుండటంతో నార్లు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులే ఆదివారం విద్యుత్‌ స్తంభాలు నిలబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నూర్‌ రూరల్‌ సీఐ జగదీశ్, నీల్వాయి, కోటపల్లి, చెన్నూర్‌ ఎస్సైలు భూమేశ్, వెంకన్న, ప్రమోద్‌లు సంఘటనా స్థలానికి వెళ్లి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. రాత్రి వరకు మృతదేహాలతో ఆందోళన కొనసాగుతూనే ఉంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మున్సిపల్‌ ఓటర్ల జాబితా సిద్ధం

స్పెషలిస్టులు ఊస్టింగే?

‘కిసాన్‌ సమ్మాన్‌’తో రైతులకు అవమానమే

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

అతడి పేరు డ డ.. తండ్రి పేరు హ హ...

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

పాత నోట్లు.. కొత్త పాట్లు!

ధర్మాధికారి నిర్ణయంపై అప్పీల్‌కు అవకాశం

‘విద్యుత్‌’పై ఎల్‌సీ వద్దు 

దోస్త్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ

మానసిక రోగులకు హాఫ్‌వే హోంలు! 

నిధుల సమీకరణపై దృష్టి!

పోలీసు శాఖలో బదిలీలకు కసరత్తు 

పీఎం–కిసాన్‌కు 34.51 లక్షల మంది రైతులు 

బిగ్‌బాస్‌ ప్రసారం నిలిపివేయాలి

అయితే డొక్కు.. లేదా తుక్కు!

ట్రాఫిక్‌ చిక్కులూ లెక్కేస్తారు!

మన్ను.. మన్నిక ఇక్రిశాట్‌ చెప్పునిక!

ఎక్కడికైనా బదిలీ!

ఈనాటి ముఖ్యాంశాలు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు

చందానగర్ పీఎస్‌ను ఆదర్శంగా తీసుకోండి

150 మంది చిన్నారులకు విముక్తి​

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

ఏటీఎం దొంగలు దొరికారు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు