వరంగల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరార్ | Sakshi
Sakshi News home page

వరంగల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరార్

Published Sun, Nov 13 2016 4:04 AM

వరంగల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరార్

వరంగల్: పటిష్ట భద్రత ఉండే వరంగల్ సెం ట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరార య్యారు. ఏకే-47 ఆయుధాన్ని అమ్మిన కేసులో శిక్ష అనుభవిస్తున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ సైనికుడు, ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లా కాంకేర్‌కేరా వాసి సైనిక్‌సింగ్,  ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న బిహార్‌లోని ఆర్యాల్ ప్రాంతానికి చెందిన రాజేశ్‌సింగ్ శనివారం తెల్లవారుజామున జైలు ప్రహరీ దూకి పారి పోయారు. వీరిద్దరూ సెంట్రల్‌జైలులోని హైసె క్యూరిటీ బ్యారక్‌లో వరంగల్ జిల్లాకు చెందిన మరో ఖైదీతో కలసి ఉంటున్నారు. వీరిలో సైనిక్‌సింగ్, రాజేశ్‌సింగ్ కలసి బ్యారక్‌కు ఉన్న తాళం పగలగొట్టి మూడంచెల భద్రతను దాటి నిరంతరం విద్యుత్ సరఫరా ఉండే గోడ దూకి పారిపోవడం సంచలనంగా మారింది. బ్యార క్‌కు ఉన్న తాళం పగులగొట్టే సమయంలో శబ్దం వస్తుందని భావించిన ఖైదీలు.. తాళా నికి, దాన్ని పగులగొట్టేందుకు ఉపయోగించిన ఐరన్ రాడ్‌కు గుడ్డ(క్లాత్)ను చుట్టి తాళం మధ్య లో ఒత్తడంతో తాళం విడిపోరుుందని తెలిసింది.

అక్కడ నుంచి వారు తప్పించుకొని ప్రహరీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న ఇనుప కొక్కానికి గుడ్డను కట్టి ప్రహరీపై వేసినట్లు తెలిసింది. ఆ కొక్కానికి దుప్పటితో తయారు చేసుకున్న తాడును కట్టి ప్రహారీగోడపైకి చేరుకొన్న ఇద్దరూ గోడ దూకి బయటకు పారిపోరుునట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రౌండ్‌‌సకు వచ్చిన జైలు సిబ్బంది.. తాళం పగిలి పోరుు ఉండడం.. బ్యారక్‌లోని ముగ్గురు ఖైదీలకు ఒక్కరే ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించగా ఇద్దరు తప్పించుకుపోరుునట్లు  బయటపడింది. కాగా, ఈ విషయం తెలుసు కున్న ఉన్నతాధికారులు సెంట్రల్ జైలుకు వచ్చారు. తప్పించుకుపోరుున ఖైదీలను పట్టు కునేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు.

నగరం చుట్టూ నాకాబందీ నిర్వహి స్తూ వాహనాలను తనిఖీలు చేయడం ప్రారం భించారు. కాగా, 20 ఫీట్ల ఎత్తుతో ఉన్న ప్రహరీకి ఇరువైపులా టవర్లు ఉన్నప్పటికీ ఇద్దరు ఖైదీలు ఆ రెండు టవర్ల మధ్య నుంచే దూకి పారిపోవడం పట్ల పలు అనుమా నాలు వ్యక్త మవుతున్నారుు. జైలు లోపల జైళ్ల శాఖకు చెందిన సిబ్బం ది పహారా, వాచింగ్ టవర్లపై ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులు నిరంతరం పర్యవేక్షణ, భద్ర త ఉన్న జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకుపోవ డాన్ని చూసి జైళ్ల శాఖతో పాటు సివిల్ పోలీసు యంత్రాంగం నివ్వెర పోరుుంది.  ఇద్దరు ఖైదీలు పారిపోవడాన్ని గుర్తించలేదంటే డ్యూటీలో ఉన్నవారు నిద్ర లో కి జారుకున్నారని అధికారులు భావిస్తు న్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో మద్యం బాటిళ్ల మూత ల సీళ్లు కనిపించడం గమనార్హం.
 
  జైలును సందర్శించిన డీజీ వీకే సింగ్
 వరంగల్ సెంట్రల్ జైలును జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ శనివారం మధ్యా హ్నం సందర్శించారు. ఖైదీలు తప్పించు కున్న తీరును,  వారు ఉపయోగించిన ఆయు ధాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జైళ్ల శాఖలో సిబ్బంది కొరత ఉందని, దీనివల్ల భద్రతలో లోపాలున్నాయన్నారు. వరంగల్ సెంట్రల్ జైలులోని 4 వాచ్ టవర్లలో మూడు టవర్లే పనిచేస్తున్నాయని, పనిచేయని టవర్ వద్ద నుంచి ఖైదీలు తప్పించుకున్నారని చెప్పారు. వారిని ఎలాగైనా పట్టుకుంటామని, ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తప్పవని వీకే సింగ్ హెచ్చరించారు.

Advertisement
Advertisement