2014 ఎన్నికలు ప్రజల నాడిని ప్రతిబింబిస్తాయి | Sakshi
Sakshi News home page

2014 ఎన్నికలు ప్రజల నాడిని ప్రతిబింబిస్తాయి

Published Sun, Sep 22 2013 9:46 AM

2014 ఎన్నికలు ప్రజల నాడిని ప్రతిబింబిస్తాయి - Sakshi

యూపీఏ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనపై నివేదికను వెంటనే విడుదల చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని పదవి అభ్యర్థి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తొమ్మిదేళ్ల కాలంలో భారతదేశాన్ని అధఃపాతాళానికి తీసుకువెళ్లిన ఘనత యూపీఏ సర్కారుదని మోడీ ఎద్దేవా చేశారు. 1977లో సాధారణ ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేంద్రంలో ప్రభుత్వం ఏలా ఏర్పడిందో అలాగే  2014 ఎన్నికల తర్వాత దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతోందని ఆయన జోస్యం చెప్పారు. ఓ విధంగా ఆ ఎన్నికలు ప్రజల నాడీకి ప్రతీక అని మోడీ అభివర్ణించారు. 

 

ఫ్లోరెడా రాష్ట్రంలో తాంపాలోని ఎన్నారైలను ఉద్దేశించి శనివారం మోడీ గుజరాత్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రధాని పదవికి మోడీని బీజేపీ ఎంపిక చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నారైలతో ప్రసంగిస్తూ... ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి ఎన్నారైలే కీలకం అని పేర్కొన్నారు. అందుకు ఎన్నారైలు సహాకరించి పార్టీ విజయానికి దోహదపడేలా కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ఎన్నారైలను మోడీ  కోరారు.

 

గతంలో వాజపాయ్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి రేటు 8.4 శాతం ఉండా నేడు మన్మోహన్ సింగ్ హయాంలో 4.8కి పడిపోయిందని విమర్శించారు. అంటే మన్మోమన్ సర్కార్ తొమ్మిదేళ్ల కాలంలో సాధించిన అభివృద్ది ఆ సంఖ్య తార్కాణం అని వ్యాఖ్యానించారు. రెండు రోజుల పాటు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూఎస్ఏ సదస్సు (ఓఎఫ్బీజేపీ- యూఎస్ఏ) ఫ్లోరెడాలోని తంపాలో శనివారం ప్రారంభమైనాయి.

 

ఆ సమావేశానికి దేశంలోని  22 రాష్ట్రాల నుంచి దాదాపు 100 మంది బీజేపీ నేతలు ఆ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో 272 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించి మోడీ భారత ప్రధానిగా ఎన్నుక అవ్వాలని ఓఎఫ్బీజేపీ- యూఎస్ఏ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

Advertisement
Advertisement