మరిన్ని సేవల్లోకి ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ | Sakshi
Sakshi News home page

మరిన్ని సేవల్లోకి ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌

Published Thu, Feb 23 2017 5:43 PM

మరిన్ని సేవల్లోకి ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ - Sakshi

కోల్‌కత్తా: చెల్లింపుల బ్యాంకుగా ఎయిర్‌ టెల్‌ ఇపుడు మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది.  ఇటీవల ప్రతిష్టా‍త్మకంగా లాంచ్‌ ఎయిర్టెల్ చెల్లింపులు బ్యాంకుకు  ఆదాయాలను విస్తరించే ప్రణాళికలను రచిస్తోంది.  థర్డ్‌ పార్టీ ఆర్థిక ఉత్పత్తుల ద్వారా రాబడి మార్గాలను  అన్వేషిస్తోంది.  రాబడి పెంచుకోవడానికి  మూడవ పార్టీ అమ్మకాలపై యోచిస్తున్నట్టు ఎయిర్‌ టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌  అధికారి  తెలిపారు  

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  మార్గదర్శకాల ప్రకారం, తమకు రుణాలను ఇచ్చే  అనుమతి లేనప్పటికీ ఇతర బ్యాంకుల మాదిరిగా మూడవ పార్టీ అమ్మకాలకు  ఎయిర్‌ టెల్‌ పేమెంట్‌ బ్యాంకుకు  అనుమతి ఉందని , ఎండీ,సీఈవో శశి, అరోరా తెలిపారు. సమీప భవిష్యత్తులో తమ  నెట్వర్క్ ద్వారా భీమా మరియు  మ్యూచుఫల్‌ ఫండ్‌ ఉత్పత్తులను విక్రయించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  అనంతరం ఎన్‌బీఎఫ్‌సీ లాంటి సంస్థల  తరహాలో   రుణాలను కూడా అందించనున్నట్టు శశి గురువారం మీడియాతో చెప్పారు.
కొన్ని నెలల క్రితం కార్యకలాపాలు మొదలుపెట్టిన తమ బ్యాంకు  20లక్షల మంది కస్టబర్‌ బేస్‌తో దేశవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల బ్యాంకింగ్ పాయింట్లను సాధించిందన్నారు.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement