దాద్రిలో కొట్టి చంపిన కేసులో అందరు అరెస్టు | Sakshi
Sakshi News home page

దాద్రిలో కొట్టి చంపిన కేసులో అందరు అరెస్టు

Published Mon, Oct 19 2015 10:41 AM

దాద్రిలో కొట్టి చంపిన కేసులో అందరు అరెస్టు - Sakshi

లక్నో: దేశంలో సంచలనం సృష్టించిన దాద్రి ఘటనకు సంబంధించి నిందితులందరిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పదిమంది నిందితులు ఉన్నారని వారిలో చివరివాడైనా పదో వాడితో సహా అరెస్టు చేశామని సోమవారం పోలీసులు స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లోని దాద్రిలోగల బిసాహాదా గ్రామంలో తన ఇంట్లో గోమాంసం కలిగి ఉన్నాడనే కారణంతో మహ్మద్ అఖ్లాక్ అనే ముస్లిం వ్యక్తిని ఆ గ్రామానికి చెందిన హిందువులు దాడి చేసి కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా నేటి బీఫ్ వివాదంపై చర్చను లేవనెత్తింది.

తొలుత ఈ కేసు నత్తనడకన సాగినప్పటికీ ప్రధాని స్థాయిలో కూడా స్పందించడంతో పోలీసులు నిందితులకోసం తీవ్రంగా గాలింపులు జరిపారు. శ్రీ ఓం, వివేక్, గౌరవ్, సౌరబ్, సందీప్, రూపేంద్ర, శివం, విశాల్ అనే ఎనిమిదిమందిని అరెస్టు చేయడంతోపాటు మరో మైనర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పదో నిందితుడి హరి ఓం కోసం తీవ్రంగా గాలింపులు జరిపిన పోలీసులు అతడి కాల్ డేటా ఆధారంగా సార్థానాలోని బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. దీంతో ఈకేసులో మొత్తం నిందితుల అరెస్టు ప్రక్రియ పూర్తి అయిందని, ఇక విచారణ ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన విశాల్ అనే వ్యక్తి స్థానిక బీజేపీ నాయకుడి కుమారుడు.

Advertisement
Advertisement