రెండేళ్లలో మరో మాంద్యం: జిమ్ రోజర్స్ | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో మరో మాంద్యం: జిమ్ రోజర్స్

Published Sun, Sep 8 2013 12:53 AM

రెండేళ్లలో మరో మాంద్యం: జిమ్ రోజర్స్ - Sakshi

 బీజింగ్: అమెరికా, ఇతర సంపన్న దేశాలు ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరించనున్న నేపథ్యంలో మరో రెండేళ్లలో ఇంకోసారి ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యం చుట్టుముట్టే అవకాశముందని ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ గురు జిమ్ రోజర్స్ వెల్లడించారు. ఉద్దీపన ప్యాకేజీలు, నగదు ముద్రణ ఏదో ఒక రకంగా, ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోక తప్పదని ఆయన తెలిపారు. అటు పైన ఇది ప్రపంచ ఎకానమీకి సమస్యలు తెచ్చిపెడుతుందని, ఏడాది..రెండేళ్ల కాలంలో మరో ఆర్థిక మాంద్యం ఎదురుకావొచ్చని రోజర్స్ పేర్కొన్నారు. కృత్రిమంగా ద్రవ్య లభ్యతను పెంచడం వల్ల కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం ఎగిసి, కరెన్సీ అనిశ్చితికి దారితీసిందని ఆయన చెప్పారు. భారీగా పతనమైన జపాన్ కరెన్సీ యెన్ దీనికి ఉదాహరణని రోజర్స్ వివరించారు.

Advertisement
Advertisement