Sakshi News home page

చిరు 'ప్రీ రిలీజ్‌'కు చిక్కులు

Published Mon, Jan 2 2017 12:26 PM

చిరు 'ప్రీ రిలీజ్‌'కు చిక్కులు - Sakshi

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్‌ 150'కు సంబంధించి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఈ సినిమా 'ప్రీ రిలీజ్‌' ఈవెంట్‌ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆడియో నేరుగా మార్కెట్‌లోకి విడుదలైన కారణంగా అభిమానుల ఉత్సాహం కోసం జనవరి 4న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 'ప్రీ రిలీజ్‌' వేడుకను నిర్వహించాలని 'ఖైదీ 150' చిత్ర యూనిట్‌ భావించింది. నిర్మాత రాంచరణ్ సూచనల మేరకు ఈవెంట్‌ అనుమతి కోసమని అభిమాన సంఘాల బాధ్యులు ప్రభుత్వాధికారులను ఆశ్రయించగా.. అనుమతి లభించలేదు. (చదవండి: ఖైదీ వేడుక వేదిక మారిందా..?)

ఎన్నో అంచనాల నడుమ నిర్వహించాలనుకున్న కార్యక్రమానికి అనుమతి లభించకపోవడంపై మెగా అభిమానులు మండిపడుతున్నారని, 'ప్రభుత్వ ఆదేశాలతోనే అధికారులు మా కార్యక్రమానికి అనుమతించడంలేదు'అని ఆరోపిస్తున్నారని 'సాక్షి' సినిమా ప్రతినిధి తెలిపారు. ముందుగా అనుకున్నట్టు జనవరి 4న కాకుండా జనవరి 7న గుంటూరులో 'ప్రీ రిలీజ్‌' ఉంటుందని సమాచారం వెల్లడైనప్పటికీ చిత్ర నిర్మాతలు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. ఏడేళ్ల విరామం చిరంజీవి నటిస్తోన్న 150వ చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. కాజల్‌ అగార్వాల్‌ హీరోయిన్‌గా వీవీ వినాయక్‌ దర్శకత్వలో రూపుద్దిద్దుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. అటు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' జనవరి 12న విడుదల కానుండటంతో బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది.  (ఓవర్సీస్లోఖైదీకి భారీ టార్గెట్)
 (కేక పెట్టిస్తున్న 'రత్తాలు రత్తాలు')

Advertisement

What’s your opinion

Advertisement