'బరాక్ ఒబామా చేతులెత్తేశారు' | Sakshi
Sakshi News home page

'బరాక్ ఒబామా చేతులెత్తేశారు'

Published Tue, Feb 25 2014 12:45 PM

'బరాక్ ఒబామా చేతులెత్తేశారు'

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించడంలో విఫలమైన ఒబామా చేతులెత్తేశారని జిందాల్ ఆరోపించారు. అర్ధిక వ్యవస్థ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషి చేయకుండా.. పరిమితమైన కార్యనిర్వహక చర్యల దృష్టిపెడుతున్నారని జిందాల్ విమర్శించారు. 
 
ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థను కనీస వేతన అర్ధిక వ్యవస్థ ప్రకటించడం ఓటిమి ఒప్పుకుంటూ తెల్ల జెండాను ఎగురవేయమేనని జిందాల్ వ్యాఖ్యలు చేశారు. ఒబామాతో జరిగిన వివిధ రాష్టాల గవర్నర్ల సమావేశంలో జిందాల్ మాట్లాడుతూ.. ఉభయ పక్షాల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ మరింత పురోగతి సాధించడానికి అవకాశముంది అనే అభిప్రాయాన్ని జిందాల్ వ్యక్తం చేశారు. 
 
ఫెడరల్ కాంట్రాక్టర్లకు గంటకు 10.10 డాలర్ల కనీస వేతనాన్ని చెల్లించాలని ఒబామా కార్యనిర్వాహక నిర్ణయం తీసుకోవడాన్ని జిందాల్ తప్పుపట్టారు. తప్పుడు నిర్ణయాలను తీసుకోవడానికి వైట్ హౌజ్ తన శక్తులను వినియోగిస్తోంది అని జిందాల్ ఆరోపించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా  రేసులో ఉన్న జిందాల్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement