ఎడారిని సారవంతమైన భూమిగా మార్చారు! | Sakshi
Sakshi News home page

ఎడారిని సారవంతమైన భూమిగా మార్చారు!

Published Sun, Sep 4 2016 4:06 PM

Chinese scientists successfully convert sand into soil

బీజింగ్: చైనా శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. ఇసుకను సారవంతమైన మట్టిగా మార్చినట్లు వారు పేర్కొన్నారు. ఇందుకోసం సరికొత్త పద్దతిని ఉపయోగించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎడారులను సారవంతమైన భూముల మార్చేందుకు ఈ పద్దతి ఉపయోగపడుతుందని చొంగ్ క్వింగ్ జియోటాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు భావిస్తున్నారు.

మొక్కలోని సెల్యూలోజ్ ని ఇసుకతో కలిపినప్పుడు నీరు, పోషకపదార్ధాలు, గాలి తదితరాలను అదే పునరుద్ధరించుకుంటోందని వారు పేర్కొన్నారు. దాదాపు 1.6 హెక్టార్ల ఇసుక ఎడారిలో ఈ పరీక్షలు నిర్వహించిన శాస్త్రజ్ఞులు వరి, మొక్కజన్న, టొమాటో, పుచ్చకాయ, పొద్దుతిరుగుడు పంటలను పండించారు. ఎడారి నుంచి భూమిగా మారిన నేలకు నీటి అవసరం సాధారణంగానే ఉంటుందని చెప్పారు. క్రిమిసంహారక మందుల అవసరం చాలా తక్కువగా ఉంటుందని, అధికంగా దిగుబడి కూడా వస్తోందని తెలిపారు.

Advertisement
Advertisement