షిండేపై ధిక్కార నోటీసును తిరస్కరించిన కోర్టు | Sakshi
Sakshi News home page

షిండేపై ధిక్కార నోటీసును తిరస్కరించిన కోర్టు

Published Wed, Sep 11 2013 2:46 PM

Court rejects contempt notice against Sushil kumar Shinde

నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష పడొచ్చంటూ వ్యాఖ్యానించినందుకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేపై డిఫెన్స్ న్యాయవాదులు ఇచ్చిన కోర్టు ధిక్కార నోటీసును కోర్టు తిరస్కరించింది. నిందితులు ముఖేష్, పవన్ గుప్తాల తరఫున వాదించిన డిఫెన్స్ న్యాయవాది ఈ మేరకు ఇచ్చిన నోటీసులను సాకేత్ ప్రాంతంలో ఉన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి యోగేశ్ ఖన్నా ఈ నోటీసును తిరస్కరించారు.

నలుగురు నిందితులకు శిక్ష విధించే అంశంపై ఇరుపక్షాల వాదనలను సాకేత్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు బుధవారం వింది. ఈ సందర్భంలోనే ముఖేష్ తరఫు న్యాయవాది వి.కె. ఆనంద్ షిండేపై కోర్టు ధిక్కార నోటీసు ఇచ్చారు. కానీ అదనపు సెషన్స్ జడ్జి ఖన్నా మాత్రం ఆ పిటిషన్ను విచారించేందుకు తిరస్కరించడంతో దాన్ని న్యాయవాది ఉపసంహరించుకున్నారు.

Advertisement
Advertisement