Sakshi News home page

బీజేపీ 100 రోజుల పాలన ఫెయిల్!

Published Tue, Sep 16 2014 6:14 PM

బీజేపీ 100 రోజుల పాలన ఫెయిల్! - Sakshi

ఎరోడ్(తమిళనాడు): ఈ మధ్యనే వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నబీజేపీ ప్రభుత్వంపై సీపీఐ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ఎన్డీఏ ప్రభుత్వం తమ ప్రభుత్వం పాలను గర్వంగా చెప్పుకుంటుందని  సీపీఐ నేత డి. పాండియన్ విమర్శించారు. దేశ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిన బీజేపీ ప్రభుత్వం.. ఏదో సాధించినట్లు గొప్పగా చెప్పుకోవడాన్నిఆయన తప్పుబట్టారు. ప్రజలకిచ్చిన హామీలను ప్రక్కను బెడితే.. ఈ వంద రోజుల పాలనలో కనీసం పారిశ్రామికంగా కూడా ఎటువంటి ప్రగతి సాధించలేకపోవడం బాధాకరమన్నారు.

 

రైతులకు తప్పనిసరిగా జీవితభీమా ఉండాలన్న ప్రభుత్వ పాలసీని కూడా సీపీఐ తప్పుబట్టింది. దీంతో పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. త్వరలో తమిళనాడులో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో ఆర్థిక బలాన్ని అడ్డుకుని సీపీఐని గెలిపించాలన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement