ఆ దేవుళ్లకు ఉల్లిపాయలే కానుకలు | Sakshi
Sakshi News home page

ఆ దేవుళ్లకు ఉల్లిపాయలే కానుకలు

Published Sat, Sep 5 2015 8:49 AM

ఆ దేవుళ్లకు ఉల్లిపాయలే కానుకలు

జైపూర్ : నిత్యవసర వస్తువులైన ఉల్లిపాయలు, పప్పులు ధరలు రోజురోజుకు రాకెట్ స్పీడ్తో ఆకాశంలోకి దూసుకుపోతున్నాయి. అయినా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన ఆ ధరలను మాత్రం నియంత్రించలేకపోతుంది. కానీ వాటి ధర ఎంత పెరిగినా లెక్కచేయకుండా కొంగు బంగారంగా కొలిచే ఆ దేవుళ్లకు మాత్రం భక్తులు తమ భక్తి ప్రపత్తులతో ఉల్లిపాయలు, పప్పులు చెల్లించుకుంటున్నారు. ఈ ఆచారం రాజస్థాన్ హనుమాన్గఢ్ జిల్లా గోమేధి గ్రామంలో కొలువు తీరిన గొగాజీ, గురు గోరఖ్నాథ్ దేవాలయాల్లో ఆచారంగా కొనసాగుతుంది. అదీ ఒక్క భాద్రపథమాసంలోనే భక్తులు ఇలా దేవుళ్లకి సమర్పిస్తారని ఆలయ అధికారులు శనివారం వెల్లడించారు.

ఈ మాసంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ నుంచి దాదాపు 40 లక్షల మంది భక్తులు ఈ దేవుళ్లను దర్శించుకుంటారని చెప్పారు. పావు కేజీ ఉల్లిపాయలు, పప్పులు చెల్లించి తమ కోర్కెలు తీర్చమని భక్తులు కోరతారని తెలిపారు.  ఈ ఒక్క మాసంలో దాదాపు 50 నుంచి 70 క్వింటాళ్ల ఉల్లిపాయలు దేవుడికి భక్తులు కానుకగా సమర్పించుకుంటారని పేర్కొన్నారు.  అయితే అలా వచ్చిన ఉల్లిపాయలను మార్కెట్లో విక్రయించి.. వచ్చిన నగదు గురు గోరఖ్నాథ్ దేవాలయం నిర్వహణతోపాటు గోశాలలోని  గోవులకు ఆహారం సమకూరుస్తామని తెలిపారు.

Advertisement
Advertisement