నిద్రను కొలిచేందుకూ ఒక పరికరం... | Sakshi
Sakshi News home page

నిద్రను కొలిచేందుకూ ఒక పరికరం...

Published Tue, Feb 11 2014 1:20 AM

నిద్రను కొలిచేందుకూ ఒక పరికరం...

లండన్: నిద్రను కొలిచేందుకూ ఒక పరికరం అందుబాటులోకి రానుంది. నిద్రా పరిమాణాన్ని, నాణ్యతను కొలిచేందుకు ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు ఒక కొత్త పరికరాన్ని రూపొందించారు. నిద్రించే ముందు బెడ్‌షీట్ కింద దీనిని అమర్చుకుంటే చాలు, ఇందులోని ఫిలిం సెన్సర్ నిద్రలో గుండె కొట్టుకునే తీరు, ఊపిరి, నిద్ర నాణ్యత, పరిమాణం వివరాలన్నింటినీ రికార్డు చేస్తుంది. ఈ వివరాలను మొబైల్ అప్లికేషన్ లేదా ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుంది. నిద్రను కొలిచేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులు ముఖ్యంగా వైద్య ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని, ఇవి అంత సౌకర్యవంతంగా ఉండవని, అందుకే ఈ కొత్త పరికరాన్ని రూపొందించామని హెల్సింకీ వర్సిటీ శాస్త్రవేత్త జూనాస్ పాలస్మా చెప్పారు.

Advertisement
Advertisement