హెచ్‌టీసీ అత్యంత ఖరీదైన ఫోన్ | Sakshi
Sakshi News home page

హెచ్‌టీసీ అత్యంత ఖరీదైన ఫోన్

Published Sat, Nov 23 2013 1:37 AM

హెచ్‌టీసీ అత్యంత  ఖరీదైన ఫోన్ - Sakshi

న్యూఢిల్లీ: హెచ్‌టీసీ కంపెనీ పెద్ద డిస్‌ప్లే ఉన్న ఫోన్,  హెచ్‌టీసీ వన్ మ్యాక్స్‌ను శుక్రవారం  మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ గరిష్ట చిల్లర ధర రూ.61,490 అని, రూ.56,490కే అందిస్తున్నామని హెచ్‌టీసీ ఇండియా కంట్రీ హెడ్ ఫైజల్ సిద్దిఖి చెప్పారు.  భారత మార్కెట్లో లభించే హెచ్‌టీసీ అత్యంత ఖరీదైన ఫోన్ ఇదేనని. హెచ్‌టీసీ ఫోనుల్లో అత్యంత పెద్ద డిస్‌ప్లే (5.9 అంగుళాలు)ఉన్న ఫోన్ కూడా ఇదేనని వివరించారు. ఈ ఫోన్‌ను ఆరు నెలసరి వాయిదాల్లో ఎలాంటి వడ్డీ, ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.  
 
 ఫోన్ సొంతదారుడే ఫొటోలు తీసుకునేలా ఫోన్ వెనకవైపు ఉండే కెమెరా కిందన ఒక స్కానర్‌ను(ఫింగర్ ప్రింట్ స్కానర్) ఏర్పాటు చేశామని వివరించారు. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 1.7 గిగా హెర్ట్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 600 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16జీబీ/32 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీ, 64 జీబీ మెమరీ వరకూ ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్, గూగుల్ డ్రైవ్ కోసం 50 జీబీ క్లౌడ్ సో ్టరేజ్ ఆప్షన్, 4 మెగాపిక్సెల్ కెమెరా, 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 25 గంటల టాక్‌టైమ్‌నిచ్చే 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలున్నాయి. కాగాత్వరలో ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తగ్గిస్తుందని సమాచారం.
 

Advertisement
Advertisement