టెస్ట్, టీ20 ర్యాంకింగ్స్: రెండో స్థానంలో టీమిండియా | Sakshi
Sakshi News home page

ఐసీసీ ర్యాంకింగ్స్: భారత్, పాక్ పోటాపోటీ

Published Tue, Jul 12 2016 8:28 PM

ICC releases Test, ODI, Twenty20 rankings

దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం టెస్ట్, వన్ డే, టీ20 ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా 2238 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా, ఆస్ట్రేలియా 3765 పాయింట్లతో ఫస్ట్ పొజిషన్ దక్కించుకుంది.

టెస్ట్ ర్యాకింగ్స్: పాక్ తో పోటాపోటీ

దాయాది పాకిస్తాన్.. భారత్ కంటే కేవలం 11 పాయింట్ల తేడాతో (2227 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచింది ఉంది. ఇంగ్లాండ్ నాలుగు, న్యూజిలాండ్ ఐదు, సౌతాఫ్రికా ఆరోస్థానంలో నిలిచాయి. గురువారం (జూలై 14) పాకిస్థాన్- ఇంగ్లాండ్ ల మధ్య టెస్ట్ సిరీర్ ప్రారంభంకానుండటంతో గెలిచిన జట్లు భారత్, ఆస్ట్రేలియాలను అధిగమించి ఒకటో ర్యాంకుకు చేరుకునే అవకాశం ఉంది.

వన్ డే ర్యాంక్స్: తొమ్మిదో స్థానంలో పాక్

ఇక వన్ డే ర్యాకుల విషయానికి వస్తే 110 రేటింగ్స్ తో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా, నాలుగు, ఇంగ్లాండ్ ఐదు, పాకిస్థాన్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.

టీ20 ర్యాంక్స్: ఆరోస్థానంలో ఆసీస్

టీ20 ర్యాకుల్లోనూ 128 రేటింగ్ తో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 132 రేటింగ్స్ తో న్యూజిలాండ్ ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. విండీస్ మూడో ర్యాంకులో, సౌతాఫ్రికా నాలుగు, ఇంగ్లాండ్ ఐదో ర్యాంకులో ఉండగా.. ఆస్ట్రేలియా ఆరో ర్యాకులో నిలవడం గమనార్హం.

మహిళల జట్టుకు నాలుగో ర్యాంక్

ఐసీసీ ప్రకటించిన మహిళా క్రికెట్ జట్ల ర్యాంకుల్లో టీమిండియా నాలుగో స్థానంలో నిలిచింది. ఆసీస్ ప్రధమ, ఇంగ్లాడ్ ద్వితీయ, కివీస్ త్రుతీయ స్థానాల్లో ఉన్నాయి.

Advertisement
Advertisement