ఐసీఐసీఐ బంపర్ ఆఫర్ | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బంపర్ ఆఫర్

Published Wed, Oct 5 2016 3:43 PM

ఐసీఐసీఐ బంపర్ ఆఫర్

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ కోతతో  మార్కెట్  వర్గాలను  విస్మయ పరిస్తే .. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ   తమ ఖాతాదారులకు  బంపర్ ఆఫర్  ప్రకటించింది. కీలక పాలసీ రేట్లను తగ్గించిన  కొద్ది గంటల్లోనే  ఐసీఐసీఐ బ్యాంక్  స్పందించింది. తామిస్తున్న రుణాలపై 0.05 శాతం మేర వడ్డీ తగ్గిస్తున్నట్టు తెలిపింది.  నెలవారీ  ఎంసీఎల్ ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్  బేస్డ్   రేట్) 8.90 నుంచి 8.85 కి తగ్గిస్తున్నట్టు   బ్యాంక్ ఒక ప్రకటనలో  వివరించింది. వార్షిక ఎంసీఎల్ఆర్ ను 9.10 శాతం నుంచి 9.05 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపింది. అంతేకాదు ఈ కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 1  నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించింది.
 
కాగా  ఆర్బీఐ  చరిత్రలో తొలిసారిగా మానిటరీ  పాలసీ  కమిటీ నిర్వహించిన పాలసీ రివ్యూ లో  రెపో రేటు పావు శాతం తగ్గించింది. తాజా కోతతో కలిపి జనవరి 2015 నుంచి రెపో రేటు 175  బేసిస్ పాయింట్లను తగ్గించగా  బ్యాంకుల బేస్ రేటు 60 బేసిస్ పాయింట్లును తగ్గించింది.   రెపో రేటును పావు శాతం మేరకు తగ్గిస్తూ, ఆ ప్రయోజనాన్ని బ్యాంకు ఖాతాదారులకు వెంటనే అందించాలని ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్  బ్యాంకులకు సూచించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement