'మీరు చేసిన పనికి బ్రిటీషు పౌరుడు బలి' | Sakshi
Sakshi News home page

'మీరు చేసిన పనికి బ్రిటీషు పౌరుడు బలి'

Published Sun, Sep 14 2014 10:41 AM

'మీరు చేసిన పనికి బ్రిటీషు పౌరుడు బలి'

సిరియాలో కిడ్నాప్ చేసిన ఇద్దరు అమెరికా జర్నలిస్టులను ఊచకోత కోసిన ఇస్లామిక్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. మరో అగ్రదేశం బ్రిటన్ కు సవాల్ విసిరారు. హెయిన్స్(44) అనే బ్రిటీషు సహాయ కార్యకర్త తల నరికి.. ఆ వీడియోను శనివారం రాత్రి ఇంటర్నెట్లో పెట్టారు. యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియో ఇంతకీ అసలైనదా కాదా అనే విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

స్కాట్లాండ్ లోని పెర్త్ ప్రాంతానికి చెందిన హెయిన్స్  ఇద్దరు పిల్లల తండ్రి. ఫ్రెంచ్ ఎయిడ్ ఏజెన్సీ తరపున పనిచేస్తున్న అతడిని గతేడాది కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా ఇరాక్ లోని కుర్దీష్ పెష్మెగ్రా పోరాటదారులకు బ్రిటన్ ప్రధాని డెవిడ్ కామెరూన్ మాట ఇచ్చినందుకు హెయిన్స్ ను హతమారుస్తున్నట్టు వీడియోలో ఇస్లామిక్ ఉగ్రవాదులు వెల్లడించారు. కామెరూన్ చేసిన పనికి బ్రిటీషు పౌరుడు మూల్యం చెల్లించుకుంటున్నాడని అందులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement