-
ఈ ధోరణి ప్రమాదకరంట
సంపాదకీయం: చూస్తుండగానే పాపం పెరిగినట్టు పెరిగిపోతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను అదుపు చేసేందుకంటూ సిరియాపై దండ యాత్రకు అమెరికా సన్నాహాలు ప్రారంభించింది. ఎప్పటిలానే భద్రతా మండలివంటి సంస్థలను విస్మరించి, అంతర్జాతీయ నియమాలను తోసిరాజని ఈ సన్నాహాలన్నీ సాగుతున్నాయి. యుద్ధ విమానాలిస్తామని, దళాలను తరలిస్తామని బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇవన్నీ పుష్కరకాలంక్రితం ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధానికి చేసుకున్న ఏర్పాట్లను గుర్తు చేస్తున్నాయి. ఇందులో ఇరాన్ సాయాన్నీ, చివరకు తన బద్ధ శత్రువైన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తోడ్పాటునూ తీసుకుందామని అమెరికా అనుకున్నా అది ఫలించలేదు. ‘నెత్తురంటిన చేతులతో చేయికలపలేమ’ని ఇరాన్ మత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. తన నేతృత్వంలో పశ్చిమ దేశాల దళాలతో కూటమినేర్పరిచి ఇరాక్, సిరియా సరిహద్దుల్లో ‘విముక్తి ప్రాంతాల’ను ప్రకటించిన ఐఎస్ ఉగ్రవాదులపై యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించడం అమెరికా లక్ష్యం. ఐఎస్ మిలిటెంట్లు ఇప్పటికే ఇద్దరు అమెరికా బందీలను హతమార్చగా, నిరుడు సిరియాలో తమకు పట్టుబడ్డ బ్రిటన్ జాతీయుడు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్త డేవిడ్ హెయిన్స్‌ను రెండురోజులక్రితం చంపేశారు. ఇది పేరుకే సున్నీల ప్రాబల్యమున్న సంస్థగానీ ఏ తెగనూ, జాతినీ విడిచిపెట్టడం లేదు. సిరియా-ఇరాక్ సరిహద్దు ప్రాంతాల్లో లొంగిరానివారందరినీ ఆ మిలిటెంట్లు చిత్రహింసలు పెడుతున్నారు. ఊచకోత కోస్తున్నారు. ఇలా ఏడెనిమిది వేలమంది ప్రాణాలు కోల్పోగా, లక్షలమంది ప్రాణాలరచేత బెట్టుకుని కొంపా,గోడూ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రపంచవ్యాప్త ఉగ్రవాద సంస్థలను ఏకఛత్రం కిందకు తీసుకొస్తామని ఐఎస్ సంస్థ ప్రకటించగా...మన దేశంతోసహా చాలా దేశాలనుంచి దీపం పురుగుల్లా అటు ఆకర్షితులవుతున్నవారు కూడా లేకపోలేదు. ఐఎస్ మిలిటెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట పడాల్సిందే. మానవీయ విలువలనూ, నాగరిక సమాజ పునాదులనూ ధ్వంసం చేస్తున్న ఈ బాపతు ఉగ్ర ధోరణులను నియంత్రించాల్సిందే. కానీ, అందుకు ఎంచుకునే తోవ కూడా సరిగా ఉండాలి. ఉగ్రవాదాన్ని అరికట్టడానికంటూ తీసుకునే చర్యలు దాన్ని మరింత పెంచి పోషించేవిగా మారకూడదు. ఈ విషయంలో అమెరికా ప్రతిసారీ చేసిన తప్పునే చేస్తున్నది. ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయంటూ ఆ దేశంపైకి 2003లో దండెత్తింది. అక్కడ సద్దాం హుస్సేన్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోసి, తన అనుకూలురను ప్రతిష్టిస్తే అక్కడి చమురు నిక్షేపాలపై ఆధిపత్యం సాధ్యమవుతుందని తలపోసింది. అది కాస్తా వికటించి ఎక్కడికక్కడ ఉగ్రవాద గ్రూపులు, బయల్దేరి ఆ దేశాన్ని వల్లకాడు చేశాయి. లిబియా, ఎమెన్, లిబియా వంటిచోట్ల కూడా ఈ వ్యూహమే అమలై అచ్చం ఇరాక్ తరహాలోనే ఉగ్రవాదం విస్తరించింది. ఇప్పుడు తాము పోరాడతామంటున్న ఐఎస్ మిలిటెంట్లు సిరియాలో అలా పుట్టుకొచ్చినవారే. తన చేతికి మట్టి అంటకుండా అసద్ సర్కారును కూల్చాలన్న అతి తెలివితో అక్కడి ప్రభుత్వ వ్యతిరేక గ్రూపులకు మారణాయుధాలు, డబ్బు కుమ్మరించింది అమెరికా, మిత్రదేశాలే. ఇదంతా సాగుతున్నప్పుడే అంతర్జాతీయ నిపుణులు నెత్తీనోరూ బాదు కున్నారు. ఆ ఆయుధాలూ, డబ్బూ అల్ కాయిదా వంటి ఉగ్రవాదుల చేతుల్లోకి పోతున్నాయని హెచ్చరించారు. అలాగైతే మరీ మంచిది కదా అని అమెరికా లెక్కలేసుకున్నది. అల్ కాయిదావంటి మొండి ఘటాలైతే అసద్‌ను అధికార పీఠంనుంచి కూలదోసేవరకూ విశ్రమించబోవని అంచనా వేసింది. అసద్ రంగం నుంచి వైదొలగాక వారి సంగతి చూడవచ్చనుకున్నది. తానొకటి తలిస్తే మిలిటెంట్లు మరోలా ఆలోచిం చారు. ఈ ఆయుధాలు, డబ్బుతో అల్ కాయిదాకు దీటైన ఐఎస్‌ను స్థాపించారు. ఆ సంస్థ నాయకుడు అబూ బకర్ ఖలీఫాగా ప్రకటించుకుని, ముస్లిం ప్రపంచమంతా తన ఆధిపత్యాన్ని అంగీకరించాలని పిలుపు నిచ్చాడు. ఇప్పుడు ఐఎస్‌ను అంతమొందించడమనే అమెరికా లక్ష్యం... ఆ సంస్థను తలదన్నే మరో ఉగ్రవాద సంస్థకు పురుడుపోయదన్న గ్యారెంటీ ఏంలేదు. ప్రపంచంలో ఏమూల ఎలాంటి అశాంతి తలెత్తినా సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికీ, అవసరమైతే పరిమిత బల ప్రయోగంతో దారికి తేవడానికీ ఐక్యరాజ్యసమితి, భద్రతామండలివంటి అంతర్జాతీయ సంస్థలు ఆవిర్భవించి ఉన్నాయి. రెండు ప్రపంచయుద్ధాలు మానవజాతికి పెనువిషాదం మిగిల్చాక, ఆ అనుభవాలనుంచి గుణపాఠాలు తీసుకుని ఏర్పరిచిన సంస్థలివి. ఈ సంస్థలకు పెద్దరికం ఇచ్చి, వాటి నిర్ణయాను సారం ప్రజాస్వామికంగా వ్యవహరిస్తే నిజానికి ఐఎస్వంటి సంస్థలకు సమాజాల్లో చోటుండదు. కానీ, దురదృష్టవశాత్తూ అమెరికా దీన్నంతటినీ విస్మరిస్తున్నది. ఇప్పుడు పీటర్ హెయిన్స్ ఉసురుతీయడంపై భద్రతా మండలి స్పందించింది. మిగిలిన బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా విడుదలచేయాలని ఐఎస్‌ను కోరింది. అంతకుమించి ఆ సంస్థను తుడిచిపెట్టేందుకు బాంబు దాడులకు దిగమని ఎవరికీ చెప్పలేదు. అందుకు సంబంధించిన తీర్మానమూ ఆ సంస్థ ముందుకు రాలేదు. పశ్చిమాసియా అట్టుడుకుతున్న వైనంపై ప్రపంచ పౌరుల్లో ఆందోళన ఉన్న మాట వాస్తవమే. అయితే, అమెరికాకు నాయకత్వం అప్పగించడం ద్వారా అది సమసిపోతుందన్న భ్రమలెవరికీ లేవు. మిలిటెంట్లను తుడిచిపెట్టే పేరిట పాకి స్థాన్, అఫ్ఘాన్ సరిహద్దుల్లోనూ, లిబియా, ఎమెన్వంటి దేశాల్లోనూ ఆ దేశం సాగించిన దాడులు ఎంత మంది సాధారణ ప్రజల ఉసురు తీశాయో అందరికీ తెలుసు. అందువల్లే అమెరికా ప్రస్తుత సమస్యను అంతర్జాతీయ సంస్థల చొరవకు వదలాలి. వాటి మార్గదర్శకత్వంలో పనిచేయాలి. -
వాళ్లను ఊరికే వదిలిపెట్టం: ఒబామా
వాషింగ్టన్: బ్రిటీషు సహాయ కార్యకర్త డేవిడ్ హెయిన్స్(44)ను ఇస్లామిక్ ఉగ్రవాదులు హత్య చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. హెయిన్స్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బ్రిటన్, అంతర్జాతీయ సమాజంతో కలిసి తీవ్రవాద తండాలను తుదముట్టిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సన్నిహిత దేశానికి చేటు చేసిన వారిని వదలబొమని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ కిరాతకానికి పాల్పడిన హంతకులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. సిరియాలో ఏడాది క్రితం కిడ్నాపైన బ్రిటీషు సహాయ కార్యకర్త డేవిడ్ హెయిన్స్ తల నరికి.. ఆ వీడియోను ఇంటర్నెట్లో పెట్టారు ఇస్లామిక్ ఉగ్రవాదులు. అంతకుముందు ఇద్దరు అమెరికా జర్నలిస్టులను ఇలాగే హతమార్చారు -
'మీరు చేసిన పనికి బ్రిటీషు పౌరుడు బలి'
సిరియాలో కిడ్నాప్ చేసిన ఇద్దరు అమెరికా జర్నలిస్టులను ఊచకోత కోసిన ఇస్లామిక్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. మరో అగ్రదేశం బ్రిటన్ కు సవాల్ విసిరారు. హెయిన్స్(44) అనే బ్రిటీషు సహాయ కార్యకర్త తల నరికి.. ఆ వీడియోను శనివారం రాత్రి ఇంటర్నెట్లో పెట్టారు. యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియో ఇంతకీ అసలైనదా కాదా అనే విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. స్కాట్లాండ్ లోని పెర్త్ ప్రాంతానికి చెందిన హెయిన్స్ ఇద్దరు పిల్లల తండ్రి. ఫ్రెంచ్ ఎయిడ్ ఏజెన్సీ తరపున పనిచేస్తున్న అతడిని గతేడాది కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా ఇరాక్ లోని కుర్దీష్ పెష్‌మెగ్రా పోరాటదారులకు బ్రిటన్ ప్రధాని డెవిడ్ కామెరూన్ మాట ఇచ్చినందుకు హెయిన్స్ ను హతమారుస్తున్నట్టు వీడియోలో ఇస్లామిక్ ఉగ్రవాదులు వెల్లడించారు. కామెరూన్ చేసిన పనికి బ్రిటీషు పౌరుడు మూల్యం చెల్లించుకుంటున్నాడని అందులో పేర్కొన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్‌కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement