'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

21 Sep, 2017 11:42 IST|Sakshiజూనియర్‌ ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో తెరకెక్కిన తాజా సినిమా 'జై లవకుశ'.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తొలిసారి మూడు విభిన్నమైన పాత్రలను పోషించాడు. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై నెటిజన్ల నుంచి పాజిటివ్‌ కామెంట్‌ వస్తోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులైతే ఈ సినిమా సూపర్‌హిట్‌ ఖాయమని ట్వీట్‌ చేస్తున్నారు. మొత్తానికి ఓవర్సీస్‌లో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్‌ మౌత్‌టాక్‌తో, పాజిటివ్‌ రివ్యూలతో 'జైలవకుశ' సినిమా ప్రారంభం కావడం చిత్రయూనిట్‌లో సంతోషం నింపుతోంది.

'జైలవకుశ' ముగ్గురు అన్నదమ్ముల స్టోరీ. ఇందులో జై, లవ, కుశగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్‌ ఎలాంటి డూప్‌ లేకుండా నటించాడు. చిన్నతనంలో కలిసి పెరిగిన ముగ్గురు అన్నదమ్ములు కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అందులో లవ బ్యాంక్‌ మేనేజర్‌ అయితే, కుశ అల్లరిగా పెరిగి దొంగగా మారతాడు. ఇక సినిమాకు అత్యంత కీలకమైన 'జై' చిన్నప్పుడు తన సోదరుల నుంచే వేరు అయి.. ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన రౌడీగా మారతాడు. ఈ ముగ్గురు తిరిగి ఎలా కలిశారు? రావణాసురుడిని ఇష్టపడే 'జై' ప్రతినాయకుడి స్వభావం నుంచి మారిపోతాడా? సోదరుల కోసం 'జై' చేసిన త్యాగమేమిటి? అన్నది తెరపై చూడాలంటున్నారు నెటిజన్లు.ఇక ఈ సినిమాకు ఉదయం నుంచే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ, రకుల్‌ప్రీత్‌సింగ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు 'జైలవకుశ' సూపర్‌హిట్‌ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. ఎన్టీఆర్‌ నటన అద్భుతం.. సూపర్‌హిట్‌ ఖాయమంటూ ట్వీట్లు పెట్టారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!