ఆహార భద్రత బిల్లుపై లోకసభలో ఓటింగ్ | Sakshi
Sakshi News home page

ఆహార భద్రత బిల్లుపై లోకసభలో ఓటింగ్

Published Mon, Aug 26 2013 8:43 PM

ఆహార భద్రత బిల్లుపై లోకసభలో ఓటింగ్ - Sakshi

ఆహార భద్రత బిల్లులోని వివిధ అంశాలపై సవరణలకు లోకసభలో ఓటింగ్ జరిపారు. ఆహార భద్రత బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం లోకసభలో ఓటింగ్ జరిపారు. ఆహార భద్రత బిల్లుకు బీఎస్పీ, జేడీయూ మద్దతు తెలుపగా, శివసేన వ్యతిరేకించింది. సీపీఐ నేతలు  సంపత్, గురుదాస్ గుప్తాలు ప్రవేశపెట్టిన సవరణలు వీగిపోయాయి. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన ఆరు సవరణలు వీగిపోయాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు లోకసభ ఆమోదం తెలిపింది. 
 
ఆహార భద్రత బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని.. విభేధాల్ని పక్కన పెట్టాలని యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ సూచించారు. అయితే రాష్ట్రాలతో సంప్రదించేంత వరకు బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టాలని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ డిమాండ్ చేశారు. 
 
 
Food Security Bill  Lok Sabha  Sonia Gandhi Samajwadi Party
 

Advertisement
Advertisement