కూతురిపై అత్యాచారం చేసిన కసాయి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

కూతురిపై అత్యాచారం చేసిన కసాయి అరెస్ట్

Published Wed, Sep 11 2013 11:57 AM

Man held for raping daughter in Bihar

కన్న కూతురు (16) పై అత్యాచారం జరిపిన నిందితుడిని బుధవారం భోజ్పూర్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం పాట్నాలో వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం ... గత వారం తన తండ్రి తనపై అత్యాచారం చేసినట్లు ఆ బాలిక తమకు ఫిర్యాదు చేసిందని తెలిపారు.

 

అత్యాచార సమయంలో తానను రక్షించమని అరిచిన తన సవతి తల్లి తనను రక్షించలేదని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తన తండ్రి గత వారం రోజులుగా తనపై నిత్యం పరుష వ్యాఖ్యలు చేస్తునాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అరా జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement